Slider కవి ప్రపంచం

భాగ్యదాయిని

#Puli Jamuna

భరతమాతకు వందనం

భవ్య చరితకు వందనం  llభరతll

మహనీయులెందరికో జన్మనిచ్చిన

మహిమాన్విత మన భరతమాత

యోగులు కర్మవీరులను గన్న

రత్నగర్భ మన భరతమాతllభరత ll

జలసిరులు పొంగిపొరలగా

సస్యశ్యామలమైన సుందర క్షేత్రము

పవిత్ర పుణ్య క్షేత్రాలతో

అలరించే అందమైన ప్రదేశముlభరతl l

చతుర్వేదములు వెలసిన

భాగ్యదాయిని భరతావనిగా

ఆది పురుషులవతరించిన

అనర్ఘమైన అమరభూమిగా

పుడమికి వన్నె చేకూర్చినది  llభరతll

విభిన్న జాతుల సమ్మేళనమే

విశ్వానికి ఆదర్శమై నిలిచినది

భిన్న భాషావేషాల సమాహారమే

మహోన్నత సంస్కృతియై వెలిగిందిllభరత ll

పులి  జమున

Related posts

మక్తల్ కాంగ్రెస్ సభ్యత్వం ఇన్ చార్జిగా రంగినేని

Satyam NEWS

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్య

Satyam NEWS

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో నారా లోకేష్ భేటీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!