33.2 C
Hyderabad
May 15, 2024 13: 18 PM
కవి ప్రపంచం

సంస్కరణల ఆద్యుడు

#Tatipamula Ramesh

బహు భాషా కోవిదుడు

సకల విద్యా సంపన్నుడు

నిజాయితీకి నిలువుటద్దం

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా

ఎగిసిపడిన  ఉద్యమ కెరటం

ఉస్మానియా విద్యా కుసుమం మన పి.వి.

రాజకీయాలలో రాటుదేలి

తెలుగోడి తెగువ చూపించి

ఢిల్లీ పీఠాన్ని ఐదు సంవత్సరాలు ఏలి

అబ్బుర పరచిన అపర చాణక్యుడు

ఐక్య ఆంధ్ర ప్రదేశ్ లో భూ సంస్కరణలు

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు

ప్రవేశపెట్టి కష్టకాలంలో ఉన్న దేశాన్ని

ప్రగతి వైపు పరుగులు పెట్టించిన

సంస్కరణలకు ఆద్యుడు మన పి.వి.

కలాన్ని కదిలించి, అక్షరాల సేద్యం చేసి

తన జ్ఞాపకాలను”ఇన్ సైడర్ “లో బంధించి

సాహిత్య శిఖర మై ఎదిగిన

ఆణిముత్యం మన స్వాతి ముత్యం

జగం మెచ్చిన భారత ముద్దుబిడ్డ

మన అందరి మార్గదర్శకుడు

పి.వి.మహాశయుడు

తాటిపాముల రమేష్ (టీచర్), వరంగల్. వాట్స్ యాప్ నెం: 7981566031

Related posts

రాజకీయ ఋషి

Satyam NEWS

ప్రశ్నించుకో

Satyam NEWS

భాగ్యనగర భాగ్యశోభ

Satyam NEWS

Leave a Comment