37.2 C
Hyderabad
May 1, 2024 13: 12 PM
Slider కవి ప్రపంచం

ప్రశ్నించుకో

#PVS Krishnakumari

ప్రశ్నించుకో, నిన్ను నీవు

నేటి దీన స్థితికి నీ బాధ్యత ఎంతని ప్రశ్నించుకో

కనిపించని శత్రువు

కాటు వేయటానికి

అదను కోసంపొంచి ఉందని

తెలిసినా నిర్లక్ష్యం

వికృత రూపం తో రక్కసి మరలా

విజృంభించింది, కోరలుచాచి

తూర్పు సూర్యుడిలా ఎగబాకుతున్నది

ఎవరిని వాళ్ళు కాపాడుకొనే స్థితిలో

మానవత్వం పడమటి సూర్యుడిలా

కుంగిపోతున్నది

బడి ముఖం చూడలేక పోతున్న చిన్నారులు,

ఆదాయం లేని బడుగు వర్గాలు,

మధ్య తరగతి వాళ్ళ

కలలను కల్ల చేస్తున్న వాస్తవ పరిస్థితి

దీనికంతటికీ కారణం ఎవరు?

మనమే..మనమే..మనమే..

ప్రమాదం అంచున ఉన్నా

మారని మన మనస్తత్వం

సామాజిక దూరమే మందు

అని తెలిసినా,

మన విందులు, వినోదాలు మనవే

ఎలక్షన్లు, కుంభమేళాలు,

ఎవరి బాగుకోసం ఇవన్నీ?

ఆవేదనాక్షరాలతో

హౄదయపు పుటల మీద రాస్తున్నా

గతి తప్పిన మన జీవన శైలి,

భావితరాలకు హీనచరిత్రగా

మిగిలి పోతుంది

పీ.వీ.యస్. కృష్ణ కుమారి

Related posts

జాబ్ లెస్ లైఫ్: నిరుద్యోగుల ఆత్మహత్యలే ఎక్కువ

Satyam NEWS

హెల్మెట్ పెట్టుకోండి..ప్రాణాలు కాపాడుకోండి..అంటున్న ట్రాఫిక్ పోలీసులు

Satyam NEWS

జీవీఎంసీ కమిషనర్ సృజన అర్ధరాత్రి బదిలీ

Satyam NEWS

Leave a Comment