42.2 C
Hyderabad
May 3, 2024 18: 12 PM
కవి ప్రపంచం

చాణక్యుడు

#Bheemavarapu Purushottam

బయటి ఆకారం అనాకర్షణగా వున్నా

అతడి ‘లోపలి మనిషి’ అద్భుతమే !

పల్లెకు బైతయి ఢిల్లికి రాజయి రాణించేడు

కమ్ముకున్న మాంద్యం మత్తొదిలించి

దేశాన్ని ప్రగతిపథం పట్టాలెక్కించి

మన్మోహనంగా పరుగులెత్తించేడు

వందేమాతరంతో నిజాము నెదిరించి

రాజకీయంతో అవినీతి నణిచేడు

స్వీయ భూసంస్కరణతో

ఆచరణాత్మక ఆదర్శవాదయ్యేడు

పల్లె నుంచి ఢిల్లీ దాక

ఢిల్లీ నుంచి పల్లె దాక

స్థిత ప్రాజ్ఞుడై మెలిగాడంతే !

వేయిపడగలెత్తిన సహజ పాండిత్యంతో

ఓ వెలుగు వెలిగాడు కూడా !

కీలక కేంద్రపదవుల అనుభవజ్ఞత

రాష్ట్రాన్ని దేశాన్ని ఏలిన రాజనీతిజ్ఞత

బహుభాషా ప్రావీణ్యపు విజ్ఞత

కలబోసి భారతావని భవితనే సరిదిద్దిన

అపర చాణక్యత మన పీవీ నరసింహునిదే కదా !!

-భీమవరపు పురుషోత్తం, రాజమండ్రి, సెల్ 9949800253

Related posts

సుమసిరి

Satyam NEWS

బోణాల జాతర

Satyam NEWS

వలస బ్రతుకులు

Satyam NEWS

Leave a Comment