38.2 C
Hyderabad
May 2, 2024 21: 14 PM
Slider కవి ప్రపంచం

“ఆత్మ” బంధువు

#PVS Krishnakumari

ఎక్కడ ఉంటావో, ఎప్పుడు వస్తావో

ఎవరికీ అంతు చిక్కదు

కను రెప్పల మాటున

దాగుంటావా!

గుండెగది లోపల

నిద్రాణంగా ఉన్నావా!

ఉచ్ఛ్వాస విశ్వాసాలతో

కలసి ఉంటావా!

ఎక్కడ ఉంటావు?

ఒకటి మాత్రం నిజం

ఎప్పుడూ వెన్నంటే ఉంటావు

జీవిత భాగస్వామితో

కన్నబిడ్డలతో, బంధుమిత్రులతో

జీవితాన్ని ఆస్వాదిస్తూన్నప్పుడు

భవిష్యత్తుకై ఆశల

ఆలోచనలు చేస్తునప్పుడు

హఠాత్తుగా అక్కడ నుంచి

ఊడిపడతావు

ప్రపంచమనే క్రీడాస్ధలిలో

మా జీవితాలతో

రకరకాల వినొదక్రీడలు

ఆడటానికి ఉరకలేస్తూ

వస్తావు

‘ఆత్మ ‘బంధువులా నవ్వుతూ

ఏదో రూపంలో వస్తావు

ఆ రూపానికి

నీవు పెట్టే పేర్లు..

హార్ట్ ఎటాక్…ఏక్సిడెంట్..

వగైరా…వగైరా…

ఓ మృత్యుదేవతా!

అనివార్యమని తెలిసినా

ఎప్పుడు ఎవరిని

కబళిస్తావో తెలియని

నీ రూపానికి అసలు పేరు

‘ మృత్యుదేవత’

పీ.వి.యస్. కృష్ణ కుమారి

Related posts

నేడు కొంచెం తగ్గిన బంగారం ధరలు

Satyam NEWS

విదేశాల నుంచి వచ్చిన వారు ఐసోలేషన్ లో ఉండాలి

Satyam NEWS

సింహపురి ఎక్స్ప్రెస్ వేళను గంటపాటు తగ్గించండి

Bhavani

Leave a Comment