33.7 C
Hyderabad
April 28, 2024 23: 49 PM
కవి ప్రపంచం

శతజయంతి సూర్యుడు

#PattemVasantha

తెలంగాణ మట్టి

పరిమళాల గుబాళింపులతో

ప్రపంచం గర్వించే నాయకుడు

ఉగ్గుపాలతో ఉద్యమ పౌరుషాన్ని 

పుణికిపుచ్చుకున్న ఉద్యమకారుడు

నిజాం నిరంకుశ పాలనాధిక్కారకుడు

హంగు ఆర్భాటాలు లేకుండా

ఒదిగి ఉండటంలో తనకు తానేసాటి

చదివింది న్యాయవాద వృత్తి

ఎదిగింది రాజకీయవేత్తగా

రాజకీయ చతురత కలిగి

స్థూలదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు

ప్రధాని పీఠంపై ఠీవిగా వెలిగిన

మన తెలుగుతేజం పాములపర్తి

అనేక పదవులకు వన్నెతెచ్చిన

అపర చాణిక్యుడు……

విఖ్యాతి పొందిన ప్రజల మనసులు

చూరగొన్న  పరిపాలనాదక్షుడు

మాతృ భాషలు ఎదగాలన్న తపస్వి

జనామోదమే భాషకు మనుగడన్న విజ్ఞాని

బహు భాషల్లోనిపుణుడు,అక్షరపిపాసి  భాషను భూషణంగా భావించిన అనువాదకుడు, సహస్రఫన్

పంచ కట్టుతో నిండైనతెలుగుదనం

ఉట్టిపడే తెలంగాణ ముద్దుబిడ్డ

ఈ శతజయంతి సూర్యుడు

ఎన్నటికీ చిరస్మరణీయుడు..

పత్తెo వసంత, కరీంనగర్

Related posts

తొణికిన స్వప్నం

Satyam NEWS

అక్షర దుప్పటి

Satyam NEWS

మహోన్నత వ్యక్తిత్వం

Satyam NEWS

Leave a Comment