38.2 C
Hyderabad
May 3, 2024 22: 07 PM
Slider కవి ప్రపంచం

వలసజీవి వ్యథాహాసం

#Dasaraju Ramarao Chicago

ఊరిడిసిన మట్టి జాగకు

ఉసూరుమనే మరలిన పయనం

పోయిన కాడ

ఉద్దార్కమే చేసిన

మెట్లేసి,ఎత్తుల కెక్కినా

కీసల కాసులు కిసుక్కున నవ్వకపాయె

మంచిగుండాలంటే మాట పడాలె

పని సురువెక్కాలంటే సెమట గుమ్మరించాలె

దానికేమీ లెక్కాపత్రముండది

యజమాని కరుణాంతరంగ గంగ పారినంతకే  లెక్క

బతుకంతా అప్పు పత్రమై

వెంటాడుతోంటే

కాలమంతా క్షతగాత్రం చేసి

ఆడుతుంటది

పెట్టిన పేరు పోయి

పిలిచెటోళ్ళదే పేరైతది

పీకేసే గుడిసెనే  పత్తా అయితది

పేగు కదలినా

ప్రేమ ముచ్చట్లకు వేళ అనుమతించది

రంధి

గుండె గ్రంధిలా కొట్టుమిట్టాడుతుంటది

రెండు కాళ్లు రెండు చేతులు

జానెడు కడుపుకు సరితూగకపాయె

అందరూ మంచోళ్లే

సూర్య చంద్ర సమానులే

ఘర్మ జలానికి ఖరీదు కట్టే

తరాజులే కరువు

కూడుకే చస్తుంటే కూడబెట్టే దెక్కడ?

పెంపకాలు పంపకాలు మా జాతకాలు కావు

వేడెక్కే నెత్తురున్నా

చల్లబరిచే స్వేదాన్నే నమ్ముకున్నం

శనిగాడు వున్న చోట పనిగాడు వుండలేడు

అలసిన దేహాల మీద

రాళ్ల వాన లాగో

చింత నిప్పుల ఎండ లాగో

నడక

నడువు….నడువు…

జోర బొంతల ముల్లెతో,

బుజమెక్కిన బుడ్డోనితో-

-దాసరాజు రామారావు, చికాగో, అమెరికా

Related posts

నిమిషాల్లో గదులు

Murali Krishna

తెలంగాణలోని చాలా ప్రాంతాలకు వానగండం

Satyam NEWS

రేప్:తాత మేనమామలే కామాందులై యువతిని చెరుస్తూ

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam June 10, 2020 at 3:14 AM

Excellent

Reply

Leave a Comment