38.2 C
Hyderabad
April 28, 2024 22: 45 PM
కవి ప్రపంచం

ఈ రాత్రిని యిలా గడిచిపోనీ

#nutenki ravindra new

ఎలాగోలా బుజ్జగించి

ఈ రాత్రిని నిద్రబుచ్చాలి

వెన్నెలస్నాన మాడుతూ జాబిలికూనతో చల్లని కబుర్లు చెప్పాలి

నక్షత్రాల కాంతిని కొంత దొంగిలించి

అక్షరాలకు మెరుపుగా

అలదుకోవాలి

శీతల గాలులతో శీతవేళల గూర్చి విప్పుకొని

సుంత సాంత్వన నొందాలి

రేరాజుతో దోబూచులాడే మేఘాంగనల

సయ్యాటలను కౌతుకంతో తిలకించాలి

కీచురాళ్ళ స్వరాలకు తగిన

మధుర భావగీతాలు కూర్చాలి

మండూకోపనిషత్తు బెకబెకలకు

భాష్యం చెప్పే ప్రయత్నం చేయాలి

సన్నగా కురిసే హిమ తుషారాల్లో తడిసి

ఆమె యెడదకుంపటి చెంతకు చేరి

నన్ను నేను వెచ్చగా ఆరబెట్టుకోవాలి

నిమీలిత కనురెప్పల కింద కదలాడే

ఆవిడ కలల్ని వల వేసి ఒడుపుగా పట్టుకోవాలి

నుదుటిపై నర్తిస్తున్న అర్ధాంగి ముంగురులను

మురిపెంగా చూస్తూ నిద్రపెదాల మీద

విరిసిన నవ్వులను ఏరుకొని ఉదయాన్నే భద్రంగా పూమొగ్గలకి తొడగాలి

తెల్లవార్లూ యిలాగే మేలుకొని వుండి

తెల్లకాగితంపై చెరగని బ్రతుకు సంతకాన్ని చేసి

లోకం ముఖగుమ్మాన పొద్దుపొద్దున్నే

కవితాభానుడిలా ఎగురవేయాలి.

నూటెంకి రవీంద్ర, లక్షెట్టిపేట, 9491533295

Related posts

తొలకరి

Satyam NEWS

“ఒంటరితనం”…!

Satyam NEWS

శ్రీ శుభకృతి కృతి

Satyam NEWS

Leave a Comment