42.2 C
Hyderabad
April 26, 2024 15: 38 PM
కవి ప్రపంచం

రాజకీయ ఋషి

#Illendula Umadevi

తెలంగాణా ఠీవీ మనం గౌరవంగా పిలుచుకునే పీవీ

పుట్టుక అందరిదీ ఒకే తీరు కానీఆ పుట్టుక సార్ధకం చేసుకునే వారే వేరు

అటువంటివారిలో ఒకరు మన తెలుగు కీర్తి… పాములపర్తి

పీ.వీ.నరసింహారావుగారొక రాజకీయ ఋషి…మహా మనీషి

బలం లేదు,బలగం లేదు,కుటుంబాల అండ లేదు,కూటములసలే లేవు

అయినా కర్మయోగిలా,స్వయంకృషితో చేరుకున్నారు

అత్యున్నత శిఖరాలు

వారసత్వ ముద్ర లేకున్నా,భారత రాజకీయాలలో వేసారు తనదైన ముద్ర

రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధానమంత్రి వంటి పదవులనధిష్టించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

తిప్పారు భారతవిదేశాంగ విధానాన్ని కీలక మలుపులు

చేసారు రక్షణపరంగా భారతదేశాన్ని బలోపేతం

వీరి ఆర్థిక సంస్కరణలతోతొలగింది భారతావనిలో ఆర్థిక సంక్షోభం

దొరతనాన్ని వదలుకొని,చేపట్టారు భూసంస్కరణలు..గడిపారు నిరాడంబర జీవితం

నిత్యపాఠకులు వీరు..నిరంతర శోధకులు, సాహితీపిపాసి

విశ్వనాథవారి వేయి పడగలకు వీరి సహస్రఫణ్ అనువాదానికి లభించింది సాహిత్య ఎకాడమీ పురస్కారం

వీరి లోపలి మనిషిని వెలికితెచ్చిన”ఇన్సైడర్ “ఒక అద్భుతం

బహుభాషాకోవిదులు వీరు..17 భాషలలో ప్రవీణులు

“భారత రత్న”యే వీరికి తగిన గౌరవం..సముచిత పురస్కారం

వీరిశతజయంతి ఉత్సవాలు జరగాలెంతో ఘనం..అది

పీవీగారి అభిమానులందరికీ ఆనందదాయకం.

-ఉమాదేవి ఇల్లెందుల(కల్వకోట) హైదరాబాద్

Related posts

మహోన్నత వ్యక్తి

Satyam NEWS

శోభయమాన శుభకృత్

Satyam NEWS

బోనం సాక !

Satyam NEWS

Leave a Comment