38.2 C
Hyderabad
May 5, 2024 21: 56 PM
Slider కవి ప్రపంచం

ఆలోచించండి

#K.Harinath

ఆత్మహత్యల పరంపరలో

చెలరేగుతున్న  విషసంస్కృతి

అగ్గిమీద గుగ్గిలంలా

కోవిడ్ – 19 దీనికి మరింత

జత కట్టింది

నటుడు రంగనాథ్ ఆత్మహత్యల విషయంలో

అందరికీ మనోధైర్యాన్ని అందించిన తానే

చివరకు ఆత్మహత్యకు లోనుకావటం

ఇది అత్యంత విషాదకరం

ఆ క్షణం అలాంటిదేమో ?

నటులు,నటీమణులు, కవులు, కళాకారులు

ప్రేమికులు,ఆర్థిక సంక్షోభంలో

కొట్టుమిట్టాడే కుటుంబాలు

ఇలా గమ్యం తెలియక

అగమ్యగోచరంగా ఆత్మహత్యల వలలో

చిక్కుకుంటున్న వైనం

అత్యంత ప్రమాదకరం

ఆ ఘడియలో ఒక్క క్షణం ఆలోచించండి

ఓ మంచి స్నేహితుడికి చెప్పుకోండి

నివారించండి , ముందుకు సాగండి

అంతేకానీ ఆవేశంలో ఆలోచించకుండా

అడుగేయకండి

(ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా)

కె. హరనాథ్, సెల్ నెం: 9703542598

Related posts

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి

Satyam NEWS

చలో హైదరాబాద్ కు కదిలిన కార్మిక సైన్యం

Satyam NEWS

తమిళనాడులో సైబర్ క్రైం: ఆసుపత్రి డేటా చోరీ

Satyam NEWS

Leave a Comment