36.2 C
Hyderabad
May 15, 2024 18: 02 PM
కవి ప్రపంచం

స్థిత ప్రజ్ఞుడు పీవి

#Rama Ratnamala

అనూహ్యంగా అత్యున్నత ప్రధాని పదవిని

అధిష్టించిన తొలి దాక్షిణాత్యుడు

వందేమాతర గేయాలాపనతో నిజాంను ధిక్కరించిన ధీశాలి

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉన్న వినయశీలి

ఐదు సార్లు బల పరీక్ష నెగ్గిన పరిపాలనా దక్షుడు

వినూత్న భూసంస్కరణల చట్టంతో పేదల పక్షపాతిగా నిలిచిన కార్యశూరుడు

తెలుగు అధికార భాషగా వెలగాలని కలలు కన్న స్వాప్నికుడు

విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి సామాజిక అసమానతలను తొలగించిన సృజనశీలి

ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంకై సంస్కరణల బీజం వేసిన దార్శనికుడు

రాజనీతిజ్ఞతలో అపర చాణక్యుడు

అనంత లౌక్యాన్ని అంతరంగంలో దాచిన మౌనికుడు

పాండితీ ప్రకర్షతో అద్భుత రచనలు వెలువరించిన సాహితీ పిపాసి

అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ మధురిమలు పంచిన బహు భాషా కోవిదుడు

ప్రపంచం గుర్తెరిగిన మహా మేధో సంపన్నుడు

లోపలి మనిషిని బయటకు కనబడనీయని స్థిత ప్రజ్ఞుడు పాములపర్తి వేంకట నరసింహారావు !

రామా రత్నమాల, హనుమకొండ, 9885700062

Related posts

వలస దుఃఖం

Satyam NEWS

పాములపర్తి మన ఘనకీర్తి

Satyam NEWS

అక్షరనీరాజనం

Satyam NEWS

Leave a Comment