29.7 C
Hyderabad
May 2, 2024 06: 56 AM
Slider కవి ప్రపంచం

వలస దుఃఖం

#Nandhini Sidhareddy

రాజ్యాంగం సాక్షిగా

జీవనం దేవులాడుకుంటూ

మనిషి తరలి పోనిదెన్నడు?

పొట్ట పట్టుకొని

ప్రాణం ఉగ్గబట్టుకొని

పయనం కానిదెన్నడు?

వాహనాలు తేలిపోయే

రోడ్లు వేసింది వలసకూలీ

సరుకులు తరలించే

ఓడలు నిర్మించింది వలసకూలీ

ఒంటికి అందాలు అద్దిన

వర్ణవస్త్రం నేసింది వలసకూలీ

భవనాలెవరు

నగరాలెవరు

పట్టణాలెవరు

చారిత్రక కట్టడాలెవరు

కాలం సాక్షిగా వలస ఆగింది లేదు

కాలమేదయినా పాలనేదయినా

ఆకలి వలస శోకానికి నివృత్తి లేదు

కాయానికి తాళం వేయగలం గానీ

కడుపుకు తాళం లేదు

ఉన్నట్టుండి ప్రకటించిన లాక్ డౌన్ కు

వలస ఉలిక్కి పడింది

పుట్టిన ఊరికి బతుకుతున్న ఊరికి

దూరం ఎవరు కొలవగలరు

నెత్తిమీద ముల్లె చంకలో పిల్లవేలు

పట్టుకొని పిలగాడు

ఎంత దూరమో తెలువది

ఎన్ని రోజులో తెలువది

వాళ్ళ కాళ్ళ సత్తువ చూసి రోడ్లు నివ్వెర పోతాయి

వాళ్ళ గుండె కోత చూసి వలస రాతి చూసి

రాజ్యాంగం సిగ్గు పడుతుంది

రాజ్యాంగం కంటతడి పెడుతుంది

నందిని సిధారెడ్డి, సికింద్రాబాద్

Related posts

లబ్ధిదారులు దళిత బందును సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

వ్యభిచారం కేసులో జబర్దస్త్ గేమ్ షో నటులు

Satyam NEWS

ఏపిలో జిల్లాల పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam June 9, 2020 at 4:25 AM

excellent

Reply

Leave a Comment