38.2 C
Hyderabad
April 29, 2024 13: 30 PM
కవి ప్రపంచం

బలగంలేని బలమైన నాయకుడు

#Gundeti Ramana

నోటుపైన కనిపించే భాషలను

నాలుకపై నాట్యం చేయించి

సాహిత్యపు యావతో

కలాన్ని తాండవమాడించి

రాజకీయ చదరంగపు

ఎత్తుగడల లోతులు చూసిన

భారతమాత వీర విధేయుడు పీ.వి.

సుడి గుండపు అలలతో

ఉక్కిరిబిక్కిరి అయిన

భారత నావకు చుక్కానియై

అతుకుల బొంత

ప్రభుత్వాన్ని తలపై మోస్తూ

సంస్కరణల తెరచాపతో

దరి చేర్చిన చోదకుడు

తను అపర చాణక్యుడైనా..

మాతృ దేశాన్ని కమ్మిన

నల్ల మేఘాలను తరిమేసి

సగర్వంగా తలెత్తుకునేలా

చేయడంలో సిద్దహస్తుడైనా…

అర్భాటపు అడంబరాల

జెండాలను చేతబట్టనందుకో..

వ్యక్తి పూజకు తన వ్యక్తిత్వాన్ని

బాజా బజంత్రీలుగా మలుచుకోనందుకో

హస్తినలో తనకంటూ

గుర్తింపుకు నోచుకోని కీర్తి శేషుడు

బలగం లేని బలమైన నాయకుడు

గుండేటి రమణ, బొమ్మెన, జగిత్యాల జిల్లా చరవాణి :9949377287

Related posts

దేవుడా! నీవే దిక్కు

Satyam NEWS

రాదారి పాదాలు

Satyam NEWS

నీకై వేచితినోయి…

Satyam NEWS

1 comment

Ramesh October 4, 2020 at 5:09 PM

Wonderful words about PV Narasimha Rao

Reply

Leave a Comment