28.7 C
Hyderabad
May 6, 2024 10: 40 AM
కవి ప్రపంచం

తెలంగాణ ముద్దు బిడ్డ

#Doraveti Chennaiah

దొరల కుటుంబాల దురహంకృతిని జీల్చి

మించు మంచిగ నంకురించినాడు

చదువు సంధ్యల యందు నెదిగి  ఉపాధ్యాయ

హృదయమ్ములన్ని జయించినాడు

పాలన రీతులు వాక్పటుత్వమ్ములు

హితులు బూర్గులతో గ్రహించినాడు

బహుభాషలను నేర్చి పలు దేశములలోన

ఘనమైన కీర్తిని గాంచినాడు

శ్రీ వినోబ భూదానోద్య మావహమున

నెంచి దాతృత్వ గుణముచూయించినాడు

బహుముఖీనముగా వెల్గు వజ్రమట్లు

పీ.వి. మన తెల్గు జాతికి ఠీవి నిజము!

నేతృత్వమ్ముకు మారు పేరయిన యా నెహ్రూ కుటుంబమ్ముకున్

ప్రీతిన్ గూర్చిన నీతిపూర్ణు డనగా పేరొంది నానాటికిన్

జాతిన్ యేలెడి సర్వ రంగములలో జాగృత్ప్రమాణుండునై

నేతై నిల్చెను పీ.వి.భారత ప్రజానీకంబు కీర్తించగన్!

మౌనముగా సమస్యల నమాంతము మ్రింగెడి ధైర్యశాలి!  ప్రా

మాణిత ఆర్థిక స్థితికి మాన్యత గూర్చిన ధీవిశాలి ! స

మ్మానపు పాలనమ్ము బహుమానము జేసిన పీ.వి.

మా తెలం గాణము ముద్దు బిడ్డయని గర్వముగా వచియింతు నెప్పుడున్!!!

దోరవేటి (వి.చెన్నయ్య), జల్ పల్లి గ్రామం (వయా)మైలార్ దేవ్ పల్లి, హైదరాబాద్

Related posts

నాన్నకు ప్రేమతో..

Satyam NEWS

శుభమస్తు పలికిన సంక్రాంతి

Satyam NEWS

మొంబత్తి

Satyam NEWS

Leave a Comment