38.2 C
Hyderabad
April 29, 2024 20: 49 PM
కవి ప్రపంచం

అసామాన్యుడతడు

#Vyragyam Prabhakar

పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్లు

విద్యార్థి దశనుండే ఉద్యమ బాధ్యతలను

భుజానవేసుకొన్న ధీరుడతడు

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగిన బాటసారి

నరనరాన దేశభక్తిని జీర్ణించుకున్న ఉపకారి

చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన కార్యశీలి

సాహిత్యంలోని సారమెరిగిన సాహిత్యాభిమాని

తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేయు వక్త

భాషలెన్నో నేర్చుకున్న బహుభాషావేత్త

విభిన్నరంగాలలో విశ్వరూపం చూపిన వామనుడు

విదేశీయులను సైతం మెప్పించిన బహుముఖ ప్రజ్జాశాలి

భారతీయతకు ప్రతిరూపం పలువురికి  మార్గదర్శకం

స్వలాభాపేక్ష లేని సామాజిక కార్యకర్త

అలుపెరుగని ప్రజా సంక్షేమ కార్యకర్త

విజ్జానపు పలుకులతో  నిండిన సంద్రం

సాహితీ వీచికల ఉత్తుంగ తరంగం

ఆర్థిక సంస్కరణలకు తొలి విప్లవకారి

దేశాన్ని ప్రగతి దిశవైపు  నడిపిన నిరహంకారి

అలుపెరుగని గళం,విరామమెరుగని స్వరం

భరతమాత గర్వించదగిన మణిరత్నం

సామాన్యుడిలా జన్మించిన అసామాన్యుడతడు

నైతిక విలువలకు పట్టం కట్టిన రాజనీతిజ్ఞుడు

అతనే పాములపర్తి వేంకట నరసింహారావు

భారతజాతికి అతను ఆదర్శనీయుడు

అతని జీవితం భరతజాతికి అంకితం

ఆ మహోన్నతుని జీవితం మార్గదర్శకం                                                                                                                                                                                                                                                                     

డా. వైరాగ్యం ప్రభాకర్, కరీంనగర్, చరవాణి: 9014559059

Related posts

రథసారథి

Satyam NEWS

వర్షం

Satyam NEWS

పూలజాతర

Satyam NEWS

Leave a Comment