30.7 C
Hyderabad
April 29, 2024 06: 00 AM
కవి ప్రపంచం

మహోన్నత వ్యక్తి

#Ch.Nagarjuna Sharma

అచ్చ తెనుగు ఆంధ్రుడు

మన పి.వి.

బహు భాషా కోవిదుడు గా,

రాజకీయ దురంధరుడు గా,

వక్తగా, కవిగా, రచయిత గా,

బహుముఖ ప్రజ్ఞాశాలి గా,

పేరెన్నికగన్న వారు

మన పి.వి.

క్రియాశీల రాజకీయాలలో

తాను అలంకరించిన పదవులకు

ఎనలేని యశస్సును తెచ్చి పెట్టి

దేశ ప్రధాని స్థాయికెదిగిన వారు

మన పి.వి.

వారి పాలనలో…..

ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలైన

గ్లోబలైజేషన్,లిబరలైజేషన్, ప్రైవెటైజేషన్ ల అమలుతో

దేశ ఆర్థికాభివృధ్ధికి

బంగారు బాటలు వేసిన వారు

మన పి.వి.

అస్తవ్యస్తంగా వున్న

దేశ ఆర్థిక పరిస్థితిని

గాడిన పెట్టిన అపర చాణక్యుడు

మన పి.వి.

తనపై మోపిన రాజకీయపరమైన

అభియోగాలనుండీ…

ధైర్యంగా, నిర్భయంగా న్యాయస్థానం లో

తన నిర్దోషిత్వాన్ని ధ్రువీకరించుకున్న

మహోన్నత వ్యక్తి మన పి.వి.

– సి.హెచ్. నాగార్జున శర్మ, తిరుపతి, ఫోన్ నెంబర్ 8978504127

Related posts

గాన అమర్ రహే

Satyam NEWS

తలుపు తట్టింది

Satyam NEWS

వెలుగు

Satyam NEWS

Leave a Comment