41.2 C
Hyderabad
May 4, 2024 17: 40 PM
Slider కవి ప్రపంచం

మరలిరా..

#K.Harinath

స్వాతంత్ర్య సమరయోధుడా

నాయకత్వంలో నీకెవరూ

సాటిలేని శాంతి కపోతమా

ఊత కర్రతో నీవు నడచిన

పాద ముద్రలు…..

నీవు నడిపిన ఉప్పు సత్యాగ్రహం

ఆంగ్లేయులను గడగడలాడించిన

జాడలే అనుక్షణం

ఆకాశవాణి గుర్తు చేస్తుంటుంది

నీవు నడచిన బాటలోనే

మేము నడచినా

ఇంకా ఏవో దుష్టశక్తులు

స్వైరవిహారం చేస్తున్నాయి

ఖద్దరు ముసుగుల్లో

బేవర్సులు

తచ్చాడుతూనే ఉన్నారు

సరియైన నాయకులే కరువైనారు

ఏ ఒక్కరో ఇద్దరో తప్ప

దీనికి తోడు ‘ కరోనా ‘ కాటుతో

రాజ్యం అతలాకుతలమై

విలవిల్లాడుతోంది

ప్రస్తుతం

నీలాంటి నాయకుడే

మాకు శరణ్యం

మరో జన్మ ఉందంటారే

ఉంటే …ఓ…గాంధీ

రేపటి ఉజ్వల భవిష్యత్తుకు

ఊపిరి పోసే

ఉద్యమ కారుడివై తరలిరా

మరో గాంధీవై మరలిరా

కె. హరనాథ్, 9703542598

Related posts

భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

Satyam NEWS

రాంగోపాల్ వర్మ కు సిగ్గు శరం ఏమాత్రం లేదు

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారంకు ప్రాధాన్యత

Bhavani

Leave a Comment