40.2 C
Hyderabad
April 26, 2024 11: 06 AM
Slider ప్రత్యేకం

భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

#ministerktr

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ జిహెచ్ఎంసి, జలమండలి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు.

ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్ని పురపాలికలు పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని ఆయన సూచించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల పైన కూడా ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని అధికారులకు కేటీఆర్ చెప్పారు.

వరుసగా కురుస్తున్న వర్షాల వలన పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాల పైన ప్రధాన దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలని, అదే విధంగా రాష్ట్రంలోని అన్ని పూరపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిడిఎంఏ కు ఆదేశమిచ్చారు. పట్టణాలకు ఆనుకొని ఉన్న చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలని, వాటి పూర్తిస్థాయి నిలువ సామర్థ్యం, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వంటి పై సాగునీటి శాఖతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన కోరారు.

Related posts

డిసెంబ‌ర్ 2 నుంచి నివ‌ర్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌

Sub Editor

లాక్ డౌన్ వేళ 108 లోనే మహిళ ప్రసవం

Satyam NEWS

కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆదుకుంటుంది

Bhavani

Leave a Comment