31.7 C
Hyderabad
May 2, 2024 07: 25 AM
Slider కవి ప్రపంచం

వేదనాంజలి

#PVS Krishnakumari

ఓ మహాత్మా…

ఉన్నత భావాలతో కూడిన

నీ సామాన్య జీవితం

ప్రపంచాని కంతటికీ

ఆదర్శ ప్రాయమైనా

భారతావనిలో మాత్రం

నీ సిద్ధాంతాలు కనుమరుగై

సత్యాహింసలు సిగ్గు పడే

రోజులు వచ్చాయి

ధనహీనులనే అస్పృశ్యులను

ధనవంతులనే అగ్రకులజులు

అణగదొక్కుతున్న వేళ…

అర్ధరాత్రి ఆడవారికే కాదు

పట్టపగలు మగవారికి కూడా

రక్షణ లేక

అహింసా,స్వేచ్ఛలు అణగారిపోయి

హింస పడగవిప్పి

బుసలు కొడుతున్నది

సత్యాగ్రహం అనే ఆత్మ శక్తి

రోజురోజుకూ క్షీణిస్తూ

మానవతా విలువలు

దిగజారు తున్నాయి

మేనిఫెస్టో లకు ఆచరణలకు

పొంతనలేని రాజకీయ వ్యవస్థతో

భవిష్యత్తు ప్రశ్నార్థకంగా

మారుతున్న వేళ

ఓ బాపూ…

నీ ఈ జయంతి వేళ

వేదనతో నీకు అంజలి

ఘటిస్తున్నాను

స్వీకరించు నా” వేదనాంజలి”

పీ.వి.యస్.కృష్ణ కుమారి

Related posts

అంతరాలు లేని సమాజం కోసం అందరూ పోరాడాలి

Satyam NEWS

విశాఖలో పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్

Satyam NEWS

కేటీఆర్ కు ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment