33.2 C
Hyderabad
May 15, 2024 21: 04 PM
కవి ప్రపంచం

రాజమౌని

#Dasaraju Ramarao Chicago

ఆగర్భ సముద్ర మౌన

పద్మాసన పద్మాకరుడు

శిఖరాయమాన తేజో విరాగుడు

అంతర్ముఖీన జన మనఃదుఃఖ చిత్త సత్య శోధకుడు

భువన ప్రాంగణాన బహు భాషా

ధ్వజా విరాట్టుడు

ధవళ వస్త్రాంభర కళా ప్రభాత భూషణుడు

వాగ్భూషణాల సుగంధ గర్భిత భావాంభు రాశి

అనూహ్య ఊహా, వ్యూహా, పద్మ వ్యూహాల చతుర బలసంపన్న నీతిజ్ఞుడు

సింహాసనాలంకార యధిష్టర సామ్య సౌమ్య శోభా భూషితుడు

సంభాషణా చాతుర్య హాస్య, శ్లేష, ప్రజ్ఞా భాషితుడు

ప్రసంగ ప్రాసంగికతల, కాల విలువల చరితార్థ ఉపన్యాసకుడు

కరువు లేని, పరువు పోని దేశోద్దరణ

కని కల గన్న స్వాప్నికుడు

ముందు చూపు, ముందు నడక, ముందు చేత

వెనుకకు కాదు మనసు లోపలికి, గట్టి నమ్మికకి- రుజువైన సిద్దాంతుడు

మట్టి నుండి ప్రపంచానికి

ప్రపంచం నుండి గగన చంద్రికలకు

పాకినవాడు

ఆర్థిక సూత్రాల గట్లు తెంచినవాడు

విరోధ, అవరోధ, రాజ్యతంత్రాలను

చిరునవ్వు మంత్రంతో గెలిచినవాడు

అందలాలకు అందనివాడు

రాచరికం ప్రదర్శించని రాజతపస్వి

మితభాషిత్వంలో అపరిమిత శాంతికాముకుడు

ఆయనే

పెద్దాయనే

తెలంగాణ హిమోన్నతుడు

గొల్లరామవ్వల కీర్తి పుత్రుడు

దాసరాజు రామారావు

Related posts

పిచ్చుక

Satyam NEWS

ఎందుకో అంత హర్షం

Satyam NEWS

నవ వసంతం

Satyam NEWS

Leave a Comment