37.2 C
Hyderabad
May 2, 2024 14: 36 PM
Slider కవి ప్రపంచం

పిచ్చుక

#sandhyarani erabati

చెట్టుకొమ్మల పరదాలలో

పట్టుగుబురు రెమ్మల పరుపుల్లో

వెచ్చగా..మెత్తగా జారి నిద్దురపోతుంది

తొలివేకువతో కళ్ళుతెరుస్తుంది

మౌనoగ ఉన్న చెరువులో

మోము కడుక్కుంటుంది..

నింగికి నేలకు మధ్య నిలిచిన

వినీలావరణoలో..రెక్కలార్చుకుంటూ

ఎగిరి ఎగిరి తిరుగుతుంది

ఇరు సంధ్యల రంగుల్లో..

కరిగిపోతుంది…

పచ్చని  చేలపై నీటి మబ్బులా

పరుగెడుతుంది..

తోటలలో  బాటలలో

చెట్టాపట్టా లేసుకుంటూ

తిరుగుతుంది

ఆకలి తీరడానికి

నాలుగు గింజలు

చాలు దానికి

పచ్చని కొమ్మలు

ప్రాణం దాని కొలువుకి…

సన్నిహితంగా మెదిలినా

సత్యం లేని మనసుల మధ్య

మనిషి సన్నిధి కన్నా మాటలు రాని పక్షులు మిన్న…

కొమ్మ ఊయలలే..

పిచ్చుక..లాలనలు

కొండవాలులు నదీ తీరాలు

దాని లోకపుఛాయలు..

పరిమళాలు…ఆకుపచ్చలు

దాని  ప్రాణస్పర్శలు..

ఏకాంతపు విహారాలే దాని

జీవనసూత్రాలు…

సంధ్యారాణి   ఎరబాటి, డెట్రాయిట్, మిచ్చిగాన్

Related posts

గ్లోబల్ వార్మింగ్ తో కరిగిపోతున్న హిమాలయాలు

Satyam NEWS

చక్కెర ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

లేజి ఫెలో:తపాలాఉద్యోగి 24,000 ఐటమ్స్ బట్వాడా చేయలే

Satyam NEWS

Leave a Comment