38.2 C
Hyderabad
April 29, 2024 14: 07 PM
Slider జాతీయం

మరో లాక్ డౌన్ తప్పదు…సీసీఎంబి డైరెక్టర్ సంచలన వార్త!

Rakesh mishra

కరోనా పట్ల భవిష్యత్తులో చాలా అప్రమత్తంగా ఉండాలని సిసిఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.

మానవ తప్పిదాల వల్ల కరోనా చాలాచోట్ల విజృంభిస్తుందన్న ఆయన ప్రస్తుతం భారత్ లో ఢిల్లీలో మాత్రమే సెకండ్ వేవ్ కనిపిస్తోందని అన్నారు.

సెకండ్ వేవ్ అంటే భయపడడానికి చాలా కారణాలు ఉన్నాయన్న ఆయన వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కంటే కరోనా పట్ల అప్రమత్తంగా ఉండడం ఈ పరిస్థితుల్లో మంచిదని అన్నారు.
సెకండ్ వేవ్ వస్తే చాలా కష్టమన్న ఆయన ఢిల్లీలో సెకండ్ వుందని అన్నారు.

అలానే ఈ వైరస్ మన చుట్టూనే ఉందన్న సంగతి మర్చిపోవద్దు అని ఆయన పేర్కొన్నారు. కొన్ని సార్లు ఈ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, పండగలు – పెళ్లిళ్లలో జాగ్రత్తలు పాటించక పోతే మరలా లాక్ డౌన్ తప్పనిసరి అవుతుందని ఆయన పేర్కొన్నారు.

60 నుంచి 70 శాతం యాంటీబాడీలు వచ్చి హెర్డ్ ఇమ్మ్యూనిటీ లేదా వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ వేవ్ లు వస్తూనే ఉంటాయని రాకేశ్ పేర్కొన్నారు.

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే ఈ ఏడాది నుంచి మరో రెండేళ్లు పడుతుందని అందుకే మాస్క్ శానిటేషన్ బూత్ కి దూరం తోనే వైరస్ ని జయించాలని ఆయన స్ప‌ష్టం చేశారు.

Related posts

భక్తుల పాలిట పెన్నిధి గోపాలదాసుల సన్నిధి

Bhavani

దేశ కట్టుబాటుపై అల్ జజీరా విష ప్రచారం

Satyam NEWS

రాపిడ్ టెస్టు కిట్లకు వెంకయ్య సర్టిఫికెట్

Satyam NEWS

Leave a Comment