31.2 C
Hyderabad
May 3, 2024 01: 16 AM
కవి ప్రపంచం

కనుమ

#Pattem Vasanta

ఆరుగాలం కష్టపడే

అన్నదాతకు అండగా

పశువులు కూడా తోడై

బండ్లు లాగుతూ

బరువులు మోస్తూ

పొలాలు దున్ని

పంట ఇంటికి చేరేవరకు

మన జీవనానికి అవసరమోచ్చే

ధాన్యము  పండించుటలో

పాలు గ్రుడ్లు మాంసం

పశుపక్షుల ద్వారానే వస్తాయి

ఈ రోజు  పశువులను,

ఎడ్ల బండ్లను, కర్రు నాగలి

పాకలను కూడా శుభ్రం కడిగి

పసుపు కుంకుమ పూలు పెట్టి

వాటికి ఇష్టమైన ఆహారం ఇస్తూ

గోమాత దీవెనలు అందుకొని

కోళ్ల పందాలు, పొట్టేళ్ల పోటీలు

బసవన్నల విన్యాసాలతో

ఉల్లాసంగా గడిపే ఈ కనుమ

మూగజీవాలను కూడ పూజించే

గొప్ప సంస్కృతిసంప్రదాయ పండుగ

పత్తెం వసంత, కరీంనగర్

Related posts

నా దేశం-నా జెండా

Satyam NEWS

కార్మికులు

Satyam NEWS

ప్రియసఖుడు

Satyam NEWS

Leave a Comment