32.2 C
Hyderabad
May 1, 2024 23: 52 PM
Slider కవి ప్రపంచం

కార్మికులు

#NutenkiRavindar22

ఎక్కడ ఎడారులు విరబూసినా

అక్కడ వారి స్వేదజలపు సంతకమే

ఎక్కడ మేడలు నింగిని ముద్దాడినా

అక్కడ వారి శ్రమ పునాదిరాళ్ళ కేతనమే

ఎక్కడ మన పయనం సుఖభోగమై సాగినా

అక్కడ రహదారులై పరుచుకునేది

దుఃఖభాజనమైన వాళ్ళ జీవనమే

గనిలో వనిలో కార్ఖానాల్లో

ఎక్కడ పని వుంటే అక్కడ పనిముట్టై

ఊడిగం చేసేవాళ్ళూ ఉత్పత్తులు పెంచేవాళ్ళూ వాళ్ళే!

వాళ్ళు

తమ శక్తిని నమ్ముకునే వాళ్ళే కానీ

వ్యక్తిత్వాన్ని అమ్ముకునే వాళ్ళు కాదు

చెమటను చిందించేవాళ్ళే కానీ

చీదరించుకునేవాళ్ళు అసలే కాదు

కట్టుబానిసత్వపు బంధనాల్లోంచీ

వెట్టిచాకిరీ కబంద హస్తాల్లోంచీ

హక్కుపిడికిళ్ళై లేచిన వాళ్ళు

ఉదయ కెరటాలై ఎగసిన వాళ్ళు

కార్మికులన్నా శ్రామికులన్నా లేబర్లన్నా

ఏ పేరుతో పిలిచినా…

ఎర్రజెండా నీడలో సేదదీరే వెర్రిబాగులవాళ్ళు

ఖాకీ బట్టలే తోడుగా అగ్నిదాహాల్ని ఆర్పుకునే

అర్ధనగ్న దేహులు వాళ్ళు!

నూటెంకి రవీంద్ర, లక్షెట్టిపేట, 9491533295

Related posts

27న ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ఆధ్వర్యంలో ఉచిత వెబినార్

Satyam NEWS

25,26 తేదీల‌లో శంబ‌ర పోల‌మాంబ జాత‌ర‌

Satyam NEWS

పట్టుబడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్ల ధ్వంసం

Satyam NEWS

Leave a Comment