36.2 C
Hyderabad
April 27, 2024 22: 32 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ సౌమ్యనాధ నాధ స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం

#Sowmyanathaswamy Temple

ప్రతి యేటా అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య నిర్వహించే కడప జిల్లా నందలూరు లోని శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా మొదలైనాయి. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా అంకురార్పణ తో ప్రారంభమయ్యాయి.

రేపు ఉదయం ధ్వజారోహణం రాత్రి యాలివాహనం, 30 వ తేదీ ఉదయం పల్లకి సేవ రాత్రి హంస వాహనం, జులై 1 ఉదయం పల్లకి సేవ రాత్రి సింహా వాహనం, 2 వతేది రాత్రి హనుమంతు వాహనం, 3 వతేది ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం, 4 వతేది ఉదయం సూర్య ప్రభ, రాత్రి చంద్రప్రభ, 5 వతేది ఉదయం శ్రీదేవి, భూదేవిలతో సౌమ్యనాధ స్వామి కళ్యాణం వేడుకగా జరుగనున్నది.

6న రధోత్సవంతోర ముగియనున్న బ్రహ్మోత్సవాలు

అదేరోజు రాత్రి అశ్వవాహన సేవ పై స్వామి వారు ఊరేగనున్నారు. 6వతేది రథోత్సవం, చక్రస్నానం, రాత్రి ధ్వజా అవరోహణము తో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కడప జిల్లా నందలూరు లోని సౌమ్యనాథస్వామి ఆలయం పురాతనమైనది.

పది ఎకరాల విశాల స్థలంలో చుట్టూ ప్రహరి గోడ, నాలుగు వైపులా గోపురాలతో దుర్భేద్యమైన కోటలా కనపడుతుంది. పదకొండవ శతాబ్దంలో కులోత్తుంగ చోళ రాజు ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని ఆరంభించారు. తదనంతరం ఈ ప్రాంతాన్ని పాలించిన పాండ్య, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో కూడా నిర్మాణ ప్రక్రియ కొనసాగింది అంటారు.

ఎంతో ప్రాచీనమైన ఆలయం ఇది

పది హేడవ శతాబ్దంలో స్థానిక పతి రాజుల కాలంలో పూర్తి అయినట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది. తూర్పు గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఈశాన్యంలో పుష్కరణి, రాతి స్థంభం, ధ్వజస్తంభం, గరుడా ఆళ్వార్ సన్నిధి, పక్కనే ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి సన్నిది ఉంటాయి.

పూర్తిగా ఎర్ర రాతితో నిర్మించబడిన ఈ ఆలయాన్ని తిరువన్నమలై లో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి చిన్న రూపంగా పేర్కొంటారు. మొత్తం నూట ఎనిమిది స్తంభాలపైన ప్రధాన ఆలయం నిర్మించారు. స్తంభాల పైన పురాణ ఘట్టాలను, నాటి ప్రజల జీవన శైలిని, చిత్ర విచిత్రమైన జంతువులను, ఆంజనేయ, గరుడ రూపాలను సుందరంగా జీవం ఉట్టి పడేలా మలచారు.

విద్యుత్ దీపాలు ఉండని గర్భాలయం

గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ గణేశ, శ్రీ ఆదిశేష విగ్రహాలను నిలిపారు. ముఖ మండపం నుండి కొద్దిగా ఎత్తులో వున్నగర్భాలయానికి సోపాన మార్గం ఉన్నది. ఇరు వైపులా జయ విజయులు ఉంటారు. పై మండప ద్వారం వద్ద ఉండగానే శ్రీ సౌమ్యనాధ స్వామి దివ్య రూపం నయన మనోహరంగా దర్శనమిస్తుంది.

అర్ధ మండపం, గర్భలయాలలొ విద్యుత్ దీపాలుండవు. అయినా కళకళలాడుతూ కనపడతారు స్వామి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండే సూర్య కాంతితో ప్రకాశించుతారు మూల విరాట్టు.ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి కలియుగ వైకుంఠము లో కొలువు తీరిన వేంకటేశ్వరుని ప్రతి రూపంగా ఉండే ఈ ఏడు అడుగుల సుందర స్వామిలో కనపడే తేడా అక్కడ వరద హస్తం కాగా ఇక్కడ అభయ హస్తం.

గాలిగోపురం నిర్మించిన కాకతీయ ప్రతాపరుద్రుడు

ఈ ఆలయంలో తమిళంలో ఎక్కువగా తెలుగులో కొద్దిగా శాసనాలు చెక్కబడి ఉంటాయి. వివిధ రాజ వంశాల రాజులు స్వామికి సమర్పించుకొన్న కైకర్యాల వివరాలు వీటిల్లో రాసిఉన్నాయి. కాకతీయ ప్రతాప రుద్రుడు గాలి పురం నిర్మించి వంద ఎకరాల మన్యం ఆలయ నిర్వహణకు ఇచ్చినట్లుగాను, సమీపంలోని పొత్తపి ని పాలించిన తిరు వేంగ నాధుని సతీ మణి శ్రీ సౌమ్యనాదునికి బంగారు కిరీటం, శంఖు చక్రాలు , మరెన్నో స్వర్ణాభరణాలు సమర్పించు కొన్నట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది.

వాగ్గేయ కారుడు అన్నమయ్య కొంతకాలం నందలూరులో సౌమ్యనాధుని సేవలో గడిపారని, తన కీర్తనలతో స్వామిని ప్రస్తుతించారని శాసనాలలో పేర్కొన బడినది.గర్భాలయం ముందు పైకప్పుపై’’ చేప బొమ్మ ‘’ఉండటం ఇక్కడ ప్రత్యేకత .సృష్టి అంతమయ్యే ముందు వచ్చే జలప్రళయం లో నీరు ఈ ఆలయం లోని పైకప్పు పైఉన్న ఈ చేప బొమ్మను తాకగానే ఆ చేప సజీవమై ఆ నీటిలో కలిసి పోతుందని స్థానికులు చెబుతుంటారు.

భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారం

ధృడమైన నమ్మకంతో, బలమైన కోరికతో ఓం శ్రీ సౌమ్యనాదయ నమః అంటూ గర్భాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షణలు చేసి మొక్కుకొంటే మనోభీష్టాలు నెరవేరుతాయి అన్న ఒక విశ్వాసం తరతరాల నుండి ఇక్కడ కొనసాగుతూ వస్తోంది. కోరిక నెరవేరిన వారం రోజులలో వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి అని కూడా అంటారు.

ప్రజల క్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కోవిడ్ 19 విస్తరిస్తున్న నేపధ్యంలో నేటి నుంచి ప్రారంభ మైన శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తులకు ప్రవేశం లేకుండా పూర్తి ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ కమిటీతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు నందలూరు ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆలయం నాలుగు వైపులా రద్దీ లేకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

Related posts

తీన్మార్ మల్లన్న అరెస్ట్: ఖండించిన టిజేఎస్ఎస్

Satyam NEWS

ఏపీలో 53 మంది డీఎస్పీ లు బదిలీలు

Bhavani

కరెంటు కోతలతో అల్లాడుతున్న రైతులు

Satyam NEWS

Leave a Comment