39.2 C
Hyderabad
May 3, 2024 12: 24 PM
Slider చిత్తూరు

రాయలసీమకు శాపంగా అప్పర్ బద్ర ప్రాజెక్ట్

#Upper Badra Project

కర్నాటక ప్రభుత్వం చేపడుతున్న అప్పర్ బద్ర ప్రాజెక్ట్ రాయలసీమను మళ్లీ రాళ్ల సీమగా మారుస్తుందని అందుకే ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంత రైతుల ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాయలసీమ ఉద్యమ నాయకులతో,అధికార,

ప్రతిపక్ష,వామపక్ష పార్టీ నాయకులతో,రైతు,విద్యార్థి సంఘాలతో,నీటి పారుదల శాఖ అధికారులతో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి “అప్పర్ భద్ర” నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలో సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ ను, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి ని, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి స్టీరింగ్ కమిటీ సభ్యులు కలసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని సిద్దేశ్వరం వద్ద కృష్ణానది పై కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐ కానిక్ (తీగల) వంతెనకు బదులు “బ్యారేజ్ కం బ్రిడ్జి”

నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ తో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న “అపర్ భద్ర” ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడులా” మారుపోతుందని భవిష్యత్తులో రాయలసీమలోని అన్నీ జిల్లాలలో “గుక్కెడు నీళ్లు” దొరకక “ఎడారిగా” మారుతుందన్నారు. రాయలసీమ జిల్లాలలోని ఎంపీలు,ఎమ్మెల్యే లు అధికార,ప్రతిపక్ష వామపక్ష పార్టీ

నాయకులు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి “అప్పర్ బద్ర” నిర్మాణాన్ని అడ్డుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంత భవిష్యత్తు ప్రయోజనాల కోసం రాయలసీమ వాసిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే “సుప్రీం కోర్టు”ను ఆశ్రయించేందుకు తగు న్యాయపరమైన చర్యలు చేపట్టాలన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ

రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికే రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నామని భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామన్నారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని

రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగనీయబోమని తెలిపారు. సేవ్ రాయలసీమ నినాదంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఈనెల 25 నుంచి 28 వరకు జరిగే “చలో ఆదోని” కార్యక్రమానికి జెండాలు అజెండాలు పక్కనపెట్టి అందరూ భాగస్వాములు కావాలని నవీన్ విజ్ఞప్తి చేశారు.

Related posts

చంద్రబాబు అక్రమ అరెస్టుపై హైదరాబాద్ లో ర్యాలీ

Bhavani

నాణ్యమైన రోడ్లతో మరింత అభివృద్ధి

Bhavani

మంద కృష్ణమాదిగతో ములుగు జిల్లా సాధన సమితి భేటీ

Satyam NEWS

Leave a Comment