28.7 C
Hyderabad
May 5, 2024 08: 07 AM
Slider కవి ప్రపంచం

బోనం ఎట్లా తీయాలి తల్లి

#P.Kumar Tupran Medak

ఆషాఢమాసం మొదలయ్యే

నీకు పూజలు చేసే రోజులు

మా బాధలు చెప్పుకునే రోజులు

తొలకరి పూజలు చేసి నాట్లు వేసే రోజులు

ఒడి బియ్యాలు పోసే రోజులు

భవిష్యత్ చెప్పే శివ సత్తులు

చెప్పే మాటలు ఇనే రోజులు

పోతురాజుల పౌరుషాలను చూసే రోజులు

పలారం బండ్లు తీసే రోజులు

మాసం మొత్తం నీ పూజలే

గల్లీ గల్లీకి నీ పాటలే

ఊరంతా సంబురాలు చేసుకునే రోజులు

మాయదారి రోగమొచ్చి

ప్రజలందరినీ ముప్పు తిప్పలు పెట్టవట్టె

ఎట్టా చేసేది తల్లి

బోనం ఎట్లా తీయాలి తల్లి

కరోనా రాక్షసిని ఖతం చేయు తల్లి…

పి. కుమార్ తూప్రాన్, మెదక్ చరవాణి :8978631913

Related posts

లిక్కర్ స్కాంలో సంచలనం

Murali Krishna

ఘనంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 52వ జన్మదిన వేడుక

Satyam NEWS

మరోమారు.. మహిళా పోరు: రేపటి నుంచి 10 రోజుల పాటు

Satyam NEWS

Leave a Comment