26.7 C
Hyderabad
April 27, 2024 08: 16 AM
Slider కడప

బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి

#Bhatyala Changalraidu

చెన్నై లో నివాసం ఉంటున్న వైయస్ భారతి బంధువు సుధాకర్ రెడ్డి కి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేర్చేందుకు డబ్బులు తరలిస్తున్నారు అన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలని కడప జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

ఏకంగా 5.27 కోట్లు పట్టుబడినందున ఈ కేసు ఈడికి అప్పజెప్పాలని ఆయన కోరారు. పట్టుబడిన వారు మంత్రి అనుచరులే అని ఒంగోలులో అందరికి తెలుసన్నారు. పారిపోయిన మంత్రి తనయుని పట్టుకోవాలని, మంత్రి కుమారుడు ప్రణీత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరుడు నల్లమల్లి బాలు పట్టుబడ్డ విషయం వాస్తవం కాదా అని అన్నారు.

హవాలా ద్వారా వేల కోట్ల రూపాయలు తరలించిన వైనంగా సమగ్ర విచారణ జరపాలని, మంత్రి వర్గీయులు కు చెందిన ఒక్క వాహనాన్ని పట్టుకుంటేనే ఐదు కోట్ల రూపాయలు దొరికితే ఇంకా మిగిలిన వాహనాల్లో ఎంత తరలించారో, ఆ విధంగా ఎన్ని సార్లు తరలించారో అని అనుమానం వ్యక్తం చేశారు.

మంత్రి అనుచరుడు పట్టుబడ్డారు,ఆయన వద్ద ఉండే గుమస్తాలు,డ్రైవర్లు కూడా వాళ్ల మనుషులే ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడిన తరువాత కూడా నాకు సంబంధం లేదని మంత్రి బాలినేని ఏ విధంగా చెప్తారని అన్నారు. అలాగే బంగారం పట్టుబడ్డ వ్యవహారంలో మంత్రి బాలినేని కి సంబంధం లేకుంటే ప్రభుత్వం వాస్తవాలను ఎందుకు తారుమారు చేసే ప్రయత్నం చేస్తుందని ప్రశ్నించారు.

పట్టుబడిన కారు స్టిక్కర్ మంత్రిదే

జూలై 15న అర్ధరాత్రి కారు పై ఉన్న స్టిక్కర్ నా పేరుతో ఉన్న కలర్ జిరాక్స్ మంత్రి బాలినేనిదే అని, జూలై 16 ఉదయం పదకొండున్నర గంటలకు కారు పై ఉన్న స్టిక్కర్ మంత్రి బాలినేనిది కాదని ప్రచారం చేశారన్నారు. గంట గంటకు మంత్రి బాలినేని మాట మారుస్తున్నారని పోలీసులకు పట్టుబడిన TS66 E 1166 అనే కారుకు మంత్రి బాలినేనికి చెందిన స్టిక్కర్ ఉందన్నారు.

అదేవిధంగా ఈ కారుని ఎక్కడ ఆపడానికి వీలు లేదని గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు చెప్పడం జరిగిందన్నారు. నల్లమల బాలు మంత్రి శ్రీనివాస్ రెడ్డి మరియు అతని కుమారుడు ప్రణీత్ రెడ్డిలకు ముఖ్య అనుచరుడని, ఆయన తమిళనాడు నుంచి దొంగ బంగారాన్ని తీసుకువచ్చి రాజమండ్రి, విజయవాడ ఒంగోలు లో ఉన్న గోల్డ్ షాప్ కు సరఫరా చేస్తుంటాడని, అలాగే నల్లమల్లి బాలు తండ్రి బాబు అనే వ్యక్తి ఒంగోలు టౌన్ లోని గాంధీ రోడ్డులో లో బంగారం షాపు నిర్వహిస్తూ బంగారం వ్యాపారం చేస్తుంటాడని తెలిపారు.

ఇతను వైసిపి పార్టీ నుండి ఒంగోలు వాణిజ్య విభాగం అధ్యక్షుడు గా కొనసాగుతున్నాడని, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒంగోలు కార్పొరేషన్ లోని 25వ డివిజన్ నుండి వైసీపీ కార్పొరేట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ప్రస్తుతం పోటీలో ఉన్నారని తెలుపుతూ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేసి విచారం జరపాలని రాజంపేట తెలుగుదేశం పార్టీ తరుపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Related posts

ఓటును నమోదు చేసుకున్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

ఈ తల్లి ఏడుపు వినిపిస్తున్నదా పాలకులారా?

Satyam NEWS

పిండ ప్రదానాలు చేయించే పురోహితులకు సూచన

Satyam NEWS

Leave a Comment