31.7 C
Hyderabad
May 2, 2024 07: 45 AM
Slider నిజామాబాద్

మరోమారు.. మహిళా పోరు: రేపటి నుంచి 10 రోజుల పాటు

#kmareddy

కామారెడ్డి నియోజకవర్గం మరో ఉద్యమానికి సిద్ధమైంది. దానికి బీజేపీ వెన్నుదన్నుగా నిలవబోతుంది. మహిళా సంఘాల ప్రధాన సమస్యలే ఏజండాగా ఈ ఉద్యమం జరగనుంది. మొన్నటి వరకు అక్రమ కబ్జాలు, మాస్టర్ ప్లాన్ విషయంలో పోరుబాట పట్టిన బీజేపీ రేపటినుంచి 10 రోజుల పాటు మహిళా సంఘాల సమస్యలపై పోరుబాట పట్టనుంది. దానికోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. మహిళా సంఘాలు ఉద్యమంలో పాల్గొనేలా వారితో వరుస సమావేశాలు కూడా చేపట్టింది. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.

సమస్యల పరిష్కారమే ఎజండా

కామారెడ్డి నియోజకవర్గంలో సుమారుగా 8 వేల డ్వాక్రా మహిళల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు గత మూడేళ్ళుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి, అభయహస్తం డబ్బులు పెండింగులోనే ఉండిపోయాయి. దాంతో వాటిని వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. బిక్కనూర్, రాజంపేట, కామారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, దోమకొండ, బిబిపేట మండలాలతో పాటు కామారెడ్డి మున్సిపాలిటీ కూడా ఉంది. మున్సిపాలిటీ సహా గ్రామాలలో కలిపి మొత్తం 8 వేలకు పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. వీటికి అభయహస్తం కింద 6 కోట్లు, శ్రీనిధి ద్వారా సుమారుగా 4 కోట్లు, వడ్డీలేని రుణాలు 40 కోట్ల వరకు మొత్తం 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. నియోజకవర్గంలో 50 కోట్లు రావాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా 150 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల కోట్లు రావాల్సి ఉందని తెలుస్తోంది. వాటిని తక్షణమే విడుదల చేయాలని మహిళా సంఘాలతో కలిసి బీజేపీ ఆందోళనలు చేపట్టనుంది.

మూడేళ్ళ క్రితం పావలా వడ్డిపై

గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిగ్గా మూడేళ్ళ క్రితం కామారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పావలా వడ్డీ రుణాలపై బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలతో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు చేపట్టారు. అయినా స్పందన లేకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దాంతో ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రావాల్సిన పావలా వడ్డీ రుణాలను విడుదల చేసింది. ఇప్పుడు కూడా అదే విధమైన ఉద్యమానికి రమణారెడ్డి సిద్ధమయ్యారు. మహిళా సంఘాలకు రావాల్సిన 50 కోట్ల రుణాలను విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు.

ఆందోళనల షెడ్యూల్ ఇలా

రేపటి నుంచి వరుసగా ప్రతి రోజు మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి జిల్లా కేంద్రాల్లో వివిధ రకాల ఆందోళనలు చేపట్టనుంది. 30 వ తేది భిక్కనూర్, రాజంపేట మండల కేంద్రాలలో ర్యాలీ, 31 న దోమకొండ, బీబీపేట్ మండల కేంద్రాలలో ర్యాలీ, ఫిబ్రవరి 1న ఉమ్మడి మాచారెడ్డి మండల కేంద్రంలో ర్యాలీ, 3వ తేది నియోజకవర్గంలోని అన్ని మండలాల మహిళలతో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నారు. 4 వ తేది కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కామారెడ్డి రూరల్, టౌన్ మహిళ సంఘాలతో వంట వార్పు, 5వ తేది ఇందిరా చౌక్ వద్ద భిక్కనూర్ మహిళ సంఘాలతో స్వచ్ఛ కామారెడ్డిలో భాగంగా రోడ్లు ఉడ్చి నిరసన, 6వ తేది కొత్త బస్టాండ్ వద్ద దోమకొండ మహిళ సంఘాలతో బతుకమ్మ ఆడి నిరసన, 7వ తేది బీబీపేట్ మహిళ సంఘాలతో బోనాలు, 8వ తేది మాచారెడ్డి మహిళ సంఘాలతో నల్ల బాడ్జిలతో మౌన ప్రదర్శన, 9వ తేది రాజంపేట్ మహిళ సంఘాలతో శవ యాత్ర నిర్వహించనున్నారు.

Related posts

హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలగిన జిలానీ

Satyam NEWS

ఏపి అవినీతి నిరోధక శాఖ డీజీ ఆకస్మిక బదిలీ

Satyam NEWS

సేవలోనే ఆరోగ్యం.. ఆనందం అంటున్న డాక్టర్ కమ్ డైరెక్టర్

Satyam NEWS

Leave a Comment