28.2 C
Hyderabad
May 24, 2025 09: 16 AM
Slider కవి ప్రపంచం

అమ్మవారి బోనం

#Gummadi Sambamurthy

తొలకరి చిరుజల్లులు పలుకరించగా

రైతన్న ఆనందం రాజ్యమేలగా వచ్చిన

ఆషాఢమాస దీవెనల దయతో

ప్రకృతి పరవశాన చిగురించిన అందం

అరక పట్టిన కర్షక కన్నులలో కొలువుదీరిన

గ్రామ ఆరాధ్య దైవ శ్రీలు దయామృతం తో

భువి పెద్దమ్మల మనసు దోచుకొనగ

పంటల పరవశ సిరులు కాపాడమని మ్రొక్కగా

ఇష్ట పసుపు మా రోగ నిరోధకం

వేపజలమ్ము మేలు చేయగ

ముగ్గుల ముంగిళ్ళు ప్రాంగణాన

అలరించు ఆదిశక్తులు మీరు

కరువును ప్రారద్రోలి కరమున అభయమిచ్చు అమ్మ

జనజాతర నీది జగమేలు తల్లి

నిండుబొట్టు నీవు మా నుదుటి సింగారం

శూల పాణిని నీవు శత్రుసంహరిణి

పూనకమ్ముల నడుమ మా పూజ అందుకొనగ

గుడి వదిలి వచ్చి గుణ ధన రూపిణి

నీ బోనం ప్రతి యేటా నిండు మా ప్రాణం

గుమ్మడి సాంబ మూర్తి,  నందిగాం మండలం, కొత్త అగ్రహారం గ్రామం, శ్రీకాకుళం జిల్లా

ఫోన్ నెంబర్: 7702838118

Related posts

మళ్లీ క్రమం తప్పకుండా మీ ముందుకు…

Satyam NEWS

కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

Satyam NEWS

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!