38.2 C
Hyderabad
May 1, 2024 20: 01 PM
కవి ప్రపంచం

శ్రమ శక్తి గీతిక

#Sandhya Sutrave New

మేడే

కార్మిక,కర్షక

కష్టజీవులు చెమటోడ్చిన

విజయ పతాకం

ప్రపంచ గగనాన

రెపరెపలాడిన

శ్రమశక్తి పతాకం

కాలపరిమితిలేని

శ్రమశక్తి దోపిడికి

స్వస్తి పలికి

ఆకలి అన్నార్తుల

పీడితుల హక్కుల సాధనకై

రోజుకు పని,విశ్రాంతి,వినోదం

ఎనిమిదేసి గంటల విభజనే

ధ్యేయంగ,కదంతొక్కి

విజయపథం చేపట్టిన రోజు,

రెపరెపలాడిన పతాకమే

మేడే పతాకం

పారిశ్రామిక,యాంత్రిక

క్యాపిటలిస్టు యుగంలో

సామాజిక స్పృహ, చైతన్యం పెరిగి

అన్యాయాలు,అక్రమాలకు

సంకెళ్ళు వేసి,పిడికిళ్లు బిగించి

అందరి గర్జనలు

ఏకగళంమై కదిలి

విజయగీతాలాపనతో

శ్రమశక్తిపతాక  ఎగురవేయగ,

మేడే జరుపుకొనగ,

కదంతొక్కుతూ రండి

సంధ్య సుత్రావె, సుల్తాన్ షాహి, హైదరాబాద్

Related posts

లోపలి మనిషి!

Satyam NEWS

ప్రధానమైన నూరు పాఠాలు

Satyam NEWS

ప్రేమా వర్ధిల్లు

Satyam NEWS

Leave a Comment