31.7 C
Hyderabad
May 2, 2024 10: 33 AM
Slider ముఖ్యంశాలు

వాక్సిన్ ఆక్సిజన్ లోపం లేకుండా చూడండి

#Telangana CM KCR

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ ల విషయంలో గానీ, ఆక్సీజన్ మరియు బెడ్ ల లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయవద్దని, సిఎస్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను  సిఎంవో నుంచి సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు.

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సిఎం ఆదేశించారు.

Related posts

పోలీసులకు ఇంకా దొరకని తబ్లిగీ జమాత్ నాయకుడు

Satyam NEWS

2 లక్షల మంది విద్యార్థులకు చేరువైన ఐఐటీ-జే ఈఈ ఫోరం

Satyam NEWS

వైభవంగా  శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment