25.7 C
Hyderabad
May 9, 2024 07: 22 AM
కవి ప్రపంచం

అమ్మ

#Dr.S.VijayaBhaskar

నవ మాసాలు మోసి

పుత్రునిగా పుట్టడం చూసి

పంచపాండవులమని మురిసి

అవనిపై అనురాగం పెంచిన అమృతమూర్తి అమ్మ

పేదరికం పోయి పెద్దరికం దక్కాలంటే చదువే ఆయుధ మని నమ్మిన ఉపాధ్యాయురాలు

పదిమంది సంతానానికి ఏది

కావాలని అడిగిన ఇచ్చే అక్షయపాత్ర

నడకను, నడతను, తప్పతడుగు

తప్పుడడుగు నేర్పిన నాయకురాలు

పాటపాడితే పదిమంది చేరి ఎంతో

ఆడిపాడేటట్లు చేసే గాయకురాలు

శతృ పాలిట సింహాస్వప్నం

రామాయణ, మహాభారత, భాగవత కథలను వినిపిస్తూ

భక్తి భావం పెంచిన సరస్వతిమాత

కష్టాలను , ఇబ్బందులను చూసిన

అమ్మ

మా ఉద్యోగాలను, ఉన్నతులను, అవార్డులను, రివార్డులను

చూడకుండానే కన్నుమూసిన అమ్మ

ఏమిచ్చి తీర్చుకోగలం ఆమె ఋణం

అక్షరాంజలి సమర్పించడమే అసలైన సిసలైన అంజలి.

డాక్టర్.ఎస్.విజయ భాస్కర్, సైదాబాద్, హైదరాబాద్  9290826988

Related posts

సంస్కృతి వారసత్వం

Satyam NEWS

బోనం ఎట్లా తీయాలి తల్లి

Satyam NEWS

నా దారి అటువైపే…….

Satyam NEWS

Leave a Comment