35.2 C
Hyderabad
April 27, 2024 12: 08 PM
Slider కవి ప్రపంచం

అమ్మ ఆశీస్సులు

#J Shayamala New

మాతృ దినోత్సవ వేళ

మదిలో మరువంపు మొలకగా           

అమ్మ

పంచభూతాలలో కలిసినా

ప్రకృతిలో ప్రత్యక్షమవుతూ అమ్మ

మందారాలకేసి చూస్తానా

మందస్మితం చేస్తూ అమ్మ

అలసి, మావిచెంత ఆగుతానా

ఊగే కొమ్మవుతూ అమ్మ

చల్లగాలికి సేద తీరుతానా

గాలిలో లాలి పాటవుతూ అమ్మ

వెన్నెలలో విశ్రమిస్తానా

చల్లని చూపులు ప్రసరిస్తూ అమ్మ

కష్టాలలో కలత పడతానా

కలలోకొచ్చి ధైర్యమిస్తూ అమ్మ

నా ఊపిరికి మూలం అమ్మ

నా ఉనికికి ఊతం అమ్మ

ఏ లోకాలలో ఉన్నా అమ్మ

నా ఎదలో పదిలంగా అమ్మ

అమ్మ ఆశీస్సులే

నా జీవన ఉషస్సులు!

(అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా)

జె. శ్యామల

Related posts

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

Satyam NEWS

గ్యాంగ్ లీడర్: విశాఖ నుంచి షిర్టీకి గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

హెల్ప్ లెస్: ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి

Satyam NEWS

7 comments

Guru Prasad May 9, 2021 at 9:33 AM

From J Guru Prasad
Fantastic narration by smt Syamala garu
Regarding Mother and her greatness
From J Guru Prasad

Reply
G N Murty May 9, 2021 at 10:16 AM

అమ్మ మీద వ్రాసిన గేయం చాలా బాగుంది

Reply
A Raghavendra Rao May 9, 2021 at 10:46 AM

Amma విలువ తెలియని వాళ్ళు లేరు. కొందరు నిర్లక్ష్యం చేసే పిల్లలు లేక పోలేదు. ఇక్కడ రచయిత్రి గారు చక్కగా వివరించారు సరళ మైన భాషలో. అభినందనలు.
A రాఘవేంద్ర రావు, Hyderabad.

Reply
Mramalakshmi May 9, 2021 at 12:12 PM

Beautiful feeling madam

Reply
ఇలపావులూరి వెంకటేశ్వర్లు May 9, 2021 at 2:10 PM

మాతృ దినోత్సవం నాడు అమ్మ గొప్ప దనాన్ని లేలేత పదాలతో, చక్కని కవిత రూపంలో అందించిన శ్రీమతి శ్యామల గారికి హృదయ పూర్వక అభినందనలు.

Reply
Pushpa May 10, 2021 at 10:42 PM

ప్రకృతి కూడా అమ్మలాగే లాలిస్తుంది. బాగుంది మేడం మీ అక్షరసుగంధ మాల. ఇలాగే ఎన్నో కవితలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాము.

Reply
vidadala sambasivarao May 13, 2021 at 9:13 PM

కాలాలెన్ని గడిచినా
అమ్మను మరిచి పోవడం సాధ్యమా?
శ్రీమతి శ్యామల గారు అమ్మ అనురాగాన్ని
జ్ఞాపకాలలో సుస్థిరం చేశారు.
అభినందనలు.
కళాభివందనములతో
విడదల సాంబశివరావు.

Reply

Leave a Comment