27 C
Hyderabad
May 10, 2024 05: 29 AM
కవి ప్రపంచం

అమ్మవిశ్వంభర

#Redium New

అమృతవృక్షం

ఆది అక్షరం

అదే అమ్మవృక్షం

మనసువికలమై

కల్లోల సంద్రమై

తల్లడిల్లుతున్నపుడు

పెదవిపై అమ్మ పదం దొర్లక మానదు

అణువణువు అమ్మజ్ఞాపకాలు

జీవితప్రయాణంలో

ఊటబావిలా అమ్మస్మృతులు

పాలలోని తీపి

ప్రతివారి రక్తంలో ప్రవహిస్తుంది

మంచి చెడులు మతలబులు

అరటిపండులా

లాలించిచెప్పేది

అవిమరచిపోవడం అసాధ్యం

నాపంచన ఆస్తులు అంతస్తులకన్న

నాపంచన అమ్మ ఉందంటేనే గొప్ప

చిత్రంలో మదిలో

పలవరింతలో

నాలుకపై నర్తించే అమ్మపదం అమృతం

నిరంతరంప్రవహించె జీవనది అమ్మ

అందుకే అమ్మ విశ్వంభర

రేడియమ్, పాతనగరం, హైదరాబాద్

Related posts

గాన అమర్ రహే

Satyam NEWS

ఆచార్యదేవ

Satyam NEWS

శ్రామిక సంక్షేమమే సామాజిక క్షేమం

Satyam NEWS

Leave a Comment