29.7 C
Hyderabad
May 3, 2024 03: 31 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో బ్రోకర్ యిజంగా మారిన జర్నలిజం

#wanaparthyjournalist

వనపర్తి పట్టణంలో కొందరు జర్నలిజాన్ని బ్రోకర్ యిజంగా చేసినందుకు విలేకరులకు ప్లాట్ల పట్టాలు రాలేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యూజెఎఫ్) వనపర్తి జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగన్ గౌడ్ చెప్పారు. వనపర్తిలో అర్హులైన విలేకరులకు ప్లాట్ల పట్టాలు రాలేదని, గతంలో ప్లాట్లు తీసుకున్న వారు, బయటి ప్రాంతాలకు చెందిన విలేకరులు పట్టా పొందారని అయన చెప్పారు. మంత్రి నిరంజన్ రెడ్డి అందరికి పట్టాలు ఇస్తామని చెప్పారని, కాని వనపర్తితో సంబంధం లేని విలేకరులు పట్టా తీసుకున్నారని, రెవిన్యూ అధికారులు పట్టా పేపర్ పై పేర్లు రాయాల్సి ఉండగా కొందరు విలేకరులు పట్టా కాగితాలు తీసుకుని ఇష్టం ఉన్న వారి పేర్లు రాశారని, రాతను పరిశీలన చేయాలని అయన కోరారు. ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్ కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పిర్యాదు చేస్తామని అయన తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అంబర్ పేట చే నంబర్ వద్ద ఒక వైపు రాకపోకలను అనుమతించాలి

Bhavani

బిజెపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ‘చెత్త’ చిచ్చు

Satyam NEWS

పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయండి

Satyam NEWS

Leave a Comment