36.2 C
Hyderabad
May 14, 2024 18: 00 PM
కవి ప్రపంచం

ఆహాహా ఏమి రుచి

#gudipallinarasimhareddy

ఆహాహా ఏమి రుచి తెలుగువారి సంవత్సరాది

ఓహోహో ఏమిరుచి తెలుగు

పర్వపుభక్షాల రుచి

ఎగిరి ఎగిరి గంతులేయు

కోలాటపు ఆటలతో

వంగిలేచి పాటపాడె

బతుకమ్మ పాటలతో

ధరువుకెగిరి నడుములూపు

పలుక భజన ఆటలతో

పల్లెలంత ఆడిపాడే యుగాది కాంతులతో

చీరకట్టు పంచెకట్టు తెలుగుధనానికిదే కలికి మెట్టు

లేదుయెట్టు దీనిపట్టు తెలుగుభాష కలిమి చెట్టు

కాదుఇట్టు ఇంత పట్టు నొదుటమెరిసే తిలకంపుబొట్టు

ఏమిటిట్టు లేదుయెట్టు తెలుగుకవిరాజుల కలముపట్టు

చిగురేసిన కొత్తచివురు గుబురులలో ఒదిగి ఒదిగి

గొంతు యెత్తిపాడింది కోకిలమ్మ

కులికి కులికి

ఆవుప్రక్క లేగదూడ ఆడింది ఎగిరి ఎగిరి

క్రొత్తచీరకట్టి పల్లెపడుచు నడుస్తోంది ఎగిసి ఎగిసి

కొత్తపంచె కుచ్చిళ్ళను ఒడిసి చెక్కి బాపనయ్య

వసారలోని అరుగుమీద కూరుచుండె పండితయ్య

పంచాంగపు కట్టవిప్పి

చేతివేళ్ళలెక్కబెట్టి

వచ్చిపోయే టి వారికంత

జాతకాలు పంచిపెట్ఠె

ఆహాహా ఏమి రుచి తెలుగువారి సంవత్సరాది

ఓహోహో ఏమి రుచి నేతిగారెల భక్షాలరుచి

గుడిపల్లి నర్సింహారెడ్డి

Related posts

అమ్మలగన్న అమ్మ

Satyam NEWS

యుగపురుషుడు

Satyam NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి

Satyam NEWS

Leave a Comment