29.7 C
Hyderabad
May 3, 2024 04: 51 AM
కవి ప్రపంచం

యుగపురుషుడు

#Kesaraju Nirmala

చిరుమందహాసం, దయా దృక్కులు, మృదు సరళ స్వభావం,

శాంత స్వరూపం, నిస్వార్ధం, నిరాడంబరత్వం, ఠీవి, రాజసం,

కలబోసుకున్న మూర్తిమత్వం… శ్రీ పీవీ!!

ముఖ్యమంత్రిగా, వివిధశాఖల మంత్రిగా ​

వారిది ప్రత్యేక శైలి..వారు ప్రజ్ఞశాలి,

దార్శనికుడు, వక్త, విద్యావేత్త.

స్వతంత్ర ధోరణి, దేశానికే వన్నె తెచ్చిన విజ్ఞుడు,                                                                                                     

నిబద్ధత, నీతి నిజాయితీ, నియమాలతో వెలిగిన ఏకైక  రాజనీతిజ్ఞుడు.

ప్రమాదకరమైన పరిస్థితిలో పట్టం కట్టబడ్డవాడు, 

బాధ్యతాయుత,  కర్తవ్య నిర్వహణకి  కట్టుబడ్డవాడు.

ఆర్థిక సంస్కరణల పితామహుడు, అపర చాణక్యుడు,

ఆత్మవిశ్వాసంతో శ్రమించినవాడు ..  ప్రతిఫలాపేక్షలేనివాడు.

వైరాగ్యంతో  అత్యంతోన్నత బాధ్యతలను, వ్యామోహపడకుండా

పరిపూర్ణంగా నిర్వహించడమనే సందేశాన్నిమనకందించినవాడు.

తన జ్ఞాపకాలకు ‘ది ఇన్సైడర్’ గా, విశ్వనాధ ‘వేయిపడగలు’ ని హిందీలోకి

‘సహస్రఫాన్’ గా పుస్తకరూపమిచ్చిన..రచయిత, చమత్కారి, 17 భాషల్లో ప్రావీణ్యుడు.

ఆత్మాభిమాని, మహామౌని, మౌనముని, రాజకీయ మేధావి.

శ్రీ. పీవీ.. పురుషులందు యుగపురుషుడు మీరయా..

మీరొక ఆణి ‘ముత్యం’, మేలిమి ‘బంగారం’, మట్టిలో ‘మాణిక్యం’,

భరతావనికి రత్నమైన మీకు భారతరత్న ఏలా?

దేవుడిచ్చింది దేవుడికే నైవేద్యం పెట్టినట్టు,

రత్నంలాంటి  మీకు భారతరత్న చెందకుండా ఉంటుందా ??

కేశరాజు నిర్మల, ఎల్ బి నగర్, హైదరాబాద్, సెల్ నెం. 9440343242

Related posts

సింహవాహిని

Satyam NEWS

కొత్త దస్తూరి

Satyam NEWS

ఎదురీతలోనే ఆమె!

Satyam NEWS

Leave a Comment