30.7 C
Hyderabad
April 29, 2024 06: 00 AM
కవి ప్రపంచం

ప్రకృతి కళలే ఉగాది కళకళలు

#K.Veena Reddy

హేమంతానికి శీతల సీమంతంచేసి

శిశిర పవనం ఎండుటాకుల్ని రాల్చి

చైత్రమనే శుభముహూర్తాన్ని ఎంచి

వసంత ఋతుపర్ణ పల్లవమనే పాన్పుపై

సంతసాలఋజువులనే పచ్చని ప్రభలతో

‘ఉగాది సంస్కృతి’ అనే అధ్బుత శిశువును

ప్రతియేటా మనకందిస్తుంది ప్రకృతీమతల్లి!

ప్రకృతికీ ప్రాణికోటికీ చక్కటి సంబంధమున్నసరికొత్త చైతన్యమీచైత్రమాసం..

అశుభములు తొలగించి జగతికి

శుభములు గూర్చవచ్చిన శుభకృతీ

నీకు మా శోభాయమాన స్వాగత కృతి!

ఈ అపురూప సృష్టి చిత్రానికి

ఏ చెడు దృష్టినీ సోకనీకుండా

ఏ వైరస్ లు కూడా తాకకుండా

పర్యావరణం పాడు కాకుండా

ప్రాణికోటికి ఏ కీడూ సోకకుండా

మంచి సృష్టిగా మనం మలచుకుందాం..

భావితరాలకు బంగారుబాటలు వేసుకుందాం!

కె. వీణారెడ్డి, హైదరాబాద్

Related posts

ఓ ప్రేమికులారా! కాస్త ఓపిక పట్టండి!

Satyam NEWS

సింహవాహిని

Satyam NEWS

మహిళ

Satyam NEWS

Leave a Comment