39.2 C
Hyderabad
April 30, 2024 19: 39 PM
కవి ప్రపంచం

అమ్మలగన్న అమ్మ

#P.Ramachandrarao

అమ్మ! ఓ అమ్మ !అన్ని లోకాలలో,

నీ కన్నా మిన్న ఎవరు లేరు అమ్మ. అమ్మలగన్న అమ్మల కైనా అమ్మ యే ఆ దైవం.

అమ్మఒడి ఆది బతుకు పాఠాలు నేర్పే బడి.

అమ్మ అన్న పదం ఆరోగ్యానికి సోపానం.

అలుపెరుగని పోరాటా లకు ప్రతీక అమ్మ.

అన్ని దైవాల ఆది దైవం అమ్మ.

అనురాగాలను, ఆప్యాయతను, మంచితనాన్ని, మృదుత్వాన్ని, అమృతధార లైన

తన  పాలతో పంచి, పెంచి, పోషించేది అమ్మ.

మనలను నాగరిక ప్రపంచంలో మనుషులుగా నిలిపిన అఖండ ధీశాలి అమ్మ.

అమ్మ ఒడి సకల లోకాల సవ్వడి.

సకల దేవతల సందడి.

కల్లకపటమెరుగని అమ్మ మనసు,

అష్టైశ్వర్యాలను అధిగమించు అనాది దైవం అమ్మ .

కన్నులముందు కదిలే స్వర్గం అమ్మ.

ఇల లో నీకెవరు సరిలేరు అమ్మ.

సహనానికి మారుపేరు.

నాన్నతో మమేకమై, అక్కాచెల్లెళ్ల అన్నదమ్ముల అనురాధ స్మృతులతో బృందావనం నిర్మించి, ఆనందాన్ని పంచి,

అఖిల లోకాల దేవుళ్లతో పూజింపబడే ఓ అమ్మ అందుకో మా సాష్టాంగ ప్రణామాలు హృదయ పుష్పాంజలి.

పి రామచంద్రరావు, కొల్లాపూర్, 9502473012

Related posts

మధుర భాష మన తెలుగు

Satyam NEWS

అవనికి ప్రతిరూపం

Satyam NEWS

కాంతి!సంక్రాంతి!

Satyam NEWS

Leave a Comment