27.7 C
Hyderabad
May 14, 2024 06: 12 AM
కవి ప్రపంచం

ఊరించకే ఉగాది

#kondurikotibabu

సెమటసుక్కలు ఉప్పటేర్లుగా పారించి

కల్లపొడ్లుకదలక ఆగిన రైతుగుండెచూడు

చెరుకు బెల్లాలిచ్చి సవురుగానకరైతు

రెక్కలిరిగిన గూడుచూడు

పత్తివొత్తులిచ్చి కొత్తపొద్దుకులేని

చెట్టుకేలాడిన చేనుచూడు

పులుపురుచులకు రక్తధారలద్దిన రైతు

తార్రోడ్డు పాలైన రామములగ చూడు

ప్రపంచానికి పసుపుసౌభాగ్యమద్ది

చేదైన కర్షకుని కన్నీరుచూడు

వగరుమామిడికింత కరుణకలగకరేటు

వలపోయినరైతు పంటచూడు

తేనెపట్టులుతెచ్చి తీపినింపినగోండు

గుట్టలమ్ముడయ్యీ గుండెచెదిరిన పోడు

తరిగేటివనరులు పెరిగేటినగరాల

పేదలేమో..భవితరుచులెట్లు ఎరుగునో…?

ఊరించకే ఉగాది ఉరిమిచూడొకసారి

తొందరపడి మానవుడు గూడుసర్దునేమో..

కొండూరి కోటిబాబు, 9666233115

Related posts

అమ్మవారి బోనం

Satyam NEWS

ఈ దృశ్యం మారేదెన్నడు?

Satyam NEWS

ఆహ్వానం …

Satyam NEWS

Leave a Comment