30.7 C
Hyderabad
April 29, 2024 06: 26 AM
కవి ప్రపంచం

సార్థ‌క ఉగాది…

#TirunagariSrinivasNew

కాలం అర‌చేతిలో

మ‌రొక కొత్త పొద్దుపొడువు

ప్రాకృతిక రూపాన్ని ధ‌రించి

అక్ష‌ర ధ్వ‌జ‌మెత్తి

కాల‌జ్ఞ‌త‌తో ప‌దం మోపుతున్న

స‌రికొత్త ఉగాదిపై

స‌ర్వ‌త్రా ఆశ‌లు వాంఛ‌నీయ‌మే

భ్రాంతుల్ని క‌ట్టిపెట్టి

అనాలోచితాల్ని ప్ర‌క్క‌న పెట్టి

జ్ఞాన తెర‌ల‌పై

సృజ‌న శ‌క్తుల్ని వెద‌జ‌ల్లి

స‌జీవ‌త‌కు స‌మాగ‌మ‌న రూపంలా

ఉగాది రావాలి

సంక‌ల్ప‌శ‌క్తిని నింపుకుని

నిశ్చ‌ల మ‌న‌స్వినిలా

శాశ్వ‌త స‌త్యానికి ప్ర‌తీక‌గా మారాలి

దేనిక‌దే విల‌క్ష‌ణ మ‌న్న‌ట్టుగా

ఈ న‌వ‌న వోన్మేష కాల‌రూపిణి

మాన‌వ జీవ‌న గ‌మ‌నానికి

మౌలిక ప్రేర‌ణ‌గా మిగిలిపోవాలి.

తిరున‌గ‌రి శ్రీ‌నివాస్, 8466053933

Related posts

అ_ ధి_ప_తం_ట… ని_ జ_మా…?

Satyam NEWS

అంతా నీ వల్లే…

Satyam NEWS

బోనాలు

Satyam NEWS

Leave a Comment