26.7 C
Hyderabad
April 27, 2024 07: 49 AM
Slider కవి ప్రపంచం

ఈ దృశ్యం మారేదెన్నడు?

#J Shayamala New

ప్రభాతాన ప్రకృతిని ఆస్వాదించబోయా

చూడు చూడంటూ వీధి విరగబడి నవ్వింది

కుప్పలు కుప్పలుగా నా ఎదురంతా చెత్తే

తిన్నంత తిని పారేసిన ఆహార పొట్లాలు

వాటిని చిందరవందర చేస్తున్న శునకాలు

గాలికి ఎగిరెగిరి పడుతున్న కవర్లు, మాస్కులు

కాండ్రిస్తూ ఉమ్ముతూ, చీదుతూ ఉదయం నడకలవారు

రోడ్డు వారనే నాగరికుల (?) నిస్సిగ్గు మూత్రవిసర్జనలు

బైక్ మీద పోతూ చెత్త కవర్లు విసిరేస్తూ నవ యువకులు

రాత్రి సేవించిన మద్యం సీసాలను రహస్యంగా (?) పడేస్తూ ప్రబుద్ధులు

కూల్చిన కట్టడ వ్యర్థాలను   బోర్లించి దుమ్ము రేపిన ట్రాక్టరు

అంతలో ఎవరో విసిరిన సిగరెట్ పీకతో

అంటుకున్న చెత్త మంటల నాట్యం  చేస్తోంది

ప్లాస్టిక్కులు, రబ్బర్లు కాలుతున్న కమురు వాసన

చేటు చేతలతో మనిషి

తనను తానే కాటేసుకుంటున్న వైనం

వికృత వీధిని వీక్షించలేక

వెనుదిరిగి, నాలుగ్గోడల మధ్య

కుములుతూ నేను..

ఈ దృశ్యం మారేదెన్నడు?

జె. శ్యామల

Related posts

గిరిజనులకు అండగా ఉందాం

Bhavani

పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లో వైభవోపేతంగా చండీహోమం

Satyam NEWS

సస్పీషియస్ డెత్: కలకలం రేపిన విద్యార్థి మృతి

Satyam NEWS

5 comments

Mramalakshmi April 14, 2021 at 4:34 PM

Real fact madam.??

Reply
Pushpa April 14, 2021 at 5:24 PM

మారదు ఈ లోకం పోకడ..

Reply
prabhakaramsivvam April 14, 2021 at 7:10 PM

ఈ దృశ్యం ఎప్పటికీ ,ఎన్నటికీ తరతరాలు మారినా మారదు మారదు .శ్యామల గారు నిరంతర పర్యవేక్షకులు..అభినందనలు.

శివ్వాం. ప్రభాకరం.

Reply
vidadala sambasivarao April 15, 2021 at 10:47 AM

శ్రీమతి శ్యామల గారి “ఈ దృశ్యామ్ మారేదెన్నడు?” వాస్తవ జీవన విధానాన్ని కళ్లముందు నిలిపింది.ఒక్క పాత బస్తీలోనే కాదు….యావత్ భారతావని లోనూ యిదే దుస్థితి
రచయిత్రికి అభినందనలు.
కళాభివందనములతో
విడదల సాంబశివరావు.

Reply
Ramana Velamakakanni April 16, 2021 at 7:27 PM

Chala baga rasaaru Syamala garu. Social responsibility is a must for the writer. Such narrative lines would definitely bring change at least among a few. Congratulations.

Reply

Leave a Comment