40.2 C
Hyderabad
May 2, 2024 18: 42 PM
Slider కవి ప్రపంచం

రావమ్మా…!!

#Devalapally Sunanda

శుభకృతు శుభకృతు రావమ్మా

శుభాలనెన్నో తేవమ్మా

చైత్రమాసం వసంతరుతువులు రా రమ్మని  ఆహ్వానాలే పలికాయమ్మా

వేగిరమే నీవు రావమ్మా

మా జీవితాల్లో ముసిరిన

తిమిరాలన్ని నువ్ తరమాలమ్మా

దుఃఖంలో కూరుకుపోయిన

మా జీవితాల్లో వెలుగులు ఎన్నో నింపాలమ్మా

ఆకాశాన్నంటే ధరలను కాస్త భువికి దింపాలమ్మా

ప్రపంచదేశాలను కమ్మేస్తున్న యుద్ద మేఘాలను తొలగించాలమ్మా

ప్రపంచ శాంతినే నువ్ పూయించాలమ్మా

కరోనా లాంటి భయాలనే తొలగించాలమ్మా

శక్తిస్వరూపిణి అవతారమెత్తి అభయమే నువ్ ఇవ్వాలమ్మా

మనుషుల్లో మంచిని పెంచమ్మా

మానవత్వాన్ని కదిలించవమ్మా

స్వార్ధం కాస్త పక్కన పెట్టించి

మనసున మల్లెలు పూయించి మమతానురాగాల మాలలు కట్టించాలమ్మా

ఉగాది పచ్చడిలో  కలిపే షడ్రుచులల్లే

జీవితంలో కష్టసుఖాలు సమతూకంలో నువ్ వడ్డించాలమ్మా

శుభాలనే కలిగిస్తూ

శుభకృతు నీవు మధురానుభూతులే  అందించాలమ్మా

శుభకృతు శుభకృతు రావమ్మా శుభాలనెన్నో తేవమ్మా..!

దేవలపల్లి సునందా రెడ్డి, రంగారెడ్డి జిల్లా, 8297744716

Related posts

బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీతక్క

Satyam NEWS

ఆఫీసియల్:రాష్ట్రంలో ఒక్క కొవిద్‌-19 కేసు లేదు

Satyam NEWS

9, 10 తరగతులకు ఐఐటీ ఫౌండేషన్ @ టెలిగ్రామ్ యాప్

Satyam NEWS

Leave a Comment