33.7 C
Hyderabad
April 30, 2024 02: 33 AM
Slider కరీంనగర్

అద్భుత పాలనతో అగ్రగామిగా తెలంగాణ

#ministergangula

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అద్భుతమైన పాలనతో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా దూసుకెళ్తుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన శ్రీ శుభకృత్ ఉగాది పంచాంగ శ్రవణం  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమం ప్రారంభించారు.

మంత్రి ప్రజలకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయిన రాష్ట్రం  అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అద్భుతమైన పాలనతో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. ప్రపంచ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. కరీంనగర్ జిల్లా పుణ్యక్షేత్రాలకు, కవులు, కళాకారులకు నిలయమని జిల్లాలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు,జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఎందరో గొప్ప గొప్ప కవులు కరీంనగర్ గడ్డ మీద పుట్టారని అన్నారు.

కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కి  కరీంనగర్ జిల్లా ప్రజలపై ఎనలేని  ప్రేమ ఉందని అన్నారు.జిల్లాలో 10 ఎకరాల్లో అద్భుతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టనున్నామని, జిల్లాకు మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. జిల్లాలో అద్భుతంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. దేశంలోనే అద్భుతంగా జిల్లాలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామన్నారు.

మానేరు రివర్ ఫ్రంట్ కు మంత్రి కేటీఆర్ తో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని త్వరలోనే పూర్తి చేయనున్నామన్నారు. జిల్లాలో అద్భుతమైన రహదారులు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప సంకల్పంతో భద్రాద్రి ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దారని అన్నారు.

గతంలో నీరు, కరెంటు కు ఇబ్బందులు ఉండే వని నేడు ఆ పరిస్థితి లేదని  మండుటెండలో సైతం మత్తడి పై నుండి నీరు వెళ్తూ భూమికి బరువు అయ్యేవిధంగా పంటలు పండుతున్నాయి అని తెలిపారు. ప్రభుత్వ నిధులు ప్రజలకు ఉపయోగపడే విధంగా జిల్లా యంత్రాంగం పని చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి అర్చకులను వేద పండితులను,  కవులను, వాళ్లతో సత్కరించారు.

అంతకుముందు పురాణం మహేశ్వర శర్మ పంచాంగ పఠనం గావించారు. ఈ సందర్భంగా వారు పంచాంగ శ్రావణం చేస్తూ శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని,మంచి వర్షాలు పడతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. ఇనుము, ఇత్తడి, నూనెల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.దేశంలో తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అగ్రగామిగా ఉండాలన్నారు.

అనంతరం కవి సమ్మేళనం లో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ మచ్చ హరిదాసు, గులాబీల మల్లారెడ్డి వేణు శ్రీ బొద్దుల  లక్ష్మయ్య,సముద్రాల వేణుగోపాలచారి అన్నవరం దేవేందర్ సబ్బని  లక్ష్మీనారాయణ, సంకేతం నాగేంద్ర శర్మ, అంజయ్య,  షహనాజ్ ఫాతిమా అడవాల సుజాత ఇ.భద్రయ్య రేగులపాటి విజయలక్ష్మి  మహమ్మద్ నసీరుద్దీన్ నంది శ్రీనివాస్ ఇతరులు తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, కొత్తపల్లి మున్సిపల్  చైర్మన్ రుద్రరాజు, జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్,అసిస్టెంట్ కలెక్టర్ మిత్తల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ ని దేశమంతటా చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Bhavani

ఘనంగా కోడి రామ్మూర్తి నాయుడు స్మారక దినోత్సవ వేడుకలు

Satyam NEWS

పెనుకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం అస్తవ్యస్తం

Bhavani

Leave a Comment