37.2 C
Hyderabad
May 6, 2024 11: 55 AM
Slider కవి ప్రపంచం

జీవనడోల

#Sandhya Sutrave New

కూటికై కలత

తప్పని, పరిశ్రమలో నెలత

ఆకలితో ఎంతటి శ్రమకైన ‘సై’

అంతా మరచి పోతుంది ‘మై’

వలసకూలిగా అమ్మతనం

పనిలోనైనా కమ్మదనం

పసిబిడ్డకు తల్లి ఒడియే పూలపాన్పు

అదియే అన్ని బాధలను మాన్పు

అమ్మతలపై ఇటుక భట్టి

నడుము జోలెలో కూన  గట్టి

ఇటుకల బరువుతో నడిచే బొమ్మ

జోలెలో  బిడ్డకు లాలి పాడే అమ్మ

భారంగా  జాగరూక  లయబద్ద  నడక

తూగుటుయ్యాలే  జోలె పడక

ఇటుక పై ఇటుక పెరిగిన బరువు

తగ్గిస్తుంది వారి అప్పు అరువు

పనిదొరికితే  కూలికి అన్నం నిత్యం

లేకుంటే ఆకలితో మాడుటే తథ్యం

రక్షణలేని శ్రామిక రణరంగం

కావాలి  సుందర జీవన తరంగం

ఆశిద్దాం నెలతకు కలత లేని జీవితం  భావిలో  అందరు దీనికే అంకితం

అభివృధ్ధి చెందిన ఈ మరయుగం

ఇంతికౌతుందెపుడు స్వర్ణయుగం ?

సంధ్య సుత్రావె, పాత నగరం, హైదరాబాద్ 500065, ఫోన్:9177615967

Related posts

T20 world cup: భారత్ ను ఓడించిన దక్షిణాఫ్రికా

Satyam NEWS

వైష్ణోదేవి మందిరంలో తొక్కిసలాట: 12 మంది మృతి

Satyam NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment