28.7 C
Hyderabad
May 5, 2024 07: 58 AM
Slider కవి ప్రపంచం

వాన దీవెన!

#jshamalarain

చెండాడిన ఎండలను చెదరగొడుతూ

వర్షం  కేక..వస్తున్నానహో !

ప్రకృతి మాయాజాలం

ఆకాశం మబ్బుల మయం

పరుగుపందెం వేసినట్లు

రివ్వురివ్వుమంటూ గాలులు

ఆహ్లాదపరిచే మట్టి  పరిమళాలు

చిటపట చినుకుల నాందీగీతం

ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ఆహ్వానిస్తూ చాచిన చేతులకు

వర్షపు ధారల ఆత్మీయాభిషేకం

నేల తల్లి ఆనందంగా తడిసి ముద్దవగా

తరువులకేమో తలంటుకునే సంరంభం

కొమ్మలూపుతూ కులాసాలు..విలాసాలు

కాగితపు పడవలతో పిల్లల సరదాలు

కొందరేమో మిర్చి బజ్జి, పకోడీల ఆస్వాదనలు

సకల ప్రాణికోటి సేద తీరుతుంటే

కురిసి కురిసి అలసిందో.. మరెక్కడైనా పనిబడిందో

ప్రపంచాన్ని పరిశుభ్రపరిచిన వాన

వస్తా..వెళ్ళొస్తా.. మళ్ళొస్తానంటూ

ఎటో వెళ్ళిపోయింది, తన గురుతుల్ని మిగిల్చి

ఆరి ఆరని నేలమ్మ  తళతళ

కొత్తందాల  చెట్లు కళకళ

చల్లగా..హాయిగా ..ప్రశాంతంగా

అంతా వాన దీవెన!

జె.శ్యామల

Related posts

వనపర్తిలో జీరో కరంటు బిల్ ప్రారంభం

Satyam NEWS

అక్రమంగా మూసేసిన నీలమ్ జ్యూట్ మిల్లు తెరవాలి

Satyam NEWS

దాదాపు 62 ల‌క్ష‌ల‌తో విజయన‌గ‌రంలో మ‌రో డబుల్ రోడ్ నిర్మాణం..!

Satyam NEWS

2 comments

Gannavarapu+Narasimha+Murty June 30, 2023 at 7:02 AM

కవిత చాలా బావుంది
అభినందనలు

Reply
J+GuruPrasad June 30, 2023 at 7:33 AM

Great narration of smt Shyamala garu
From J GuruPrasad

Reply

Leave a Comment