40.2 C
Hyderabad
April 28, 2024 16: 34 PM
Slider విజయనగరం

దాదాపు 62 ల‌క్ష‌ల‌తో విజయన‌గ‌రంలో మ‌రో డబుల్ రోడ్ నిర్మాణం..!

#vijayanagaramroad

క‌రోనా పోవ‌డంతో ప‌నులు ఇక షురూ అంటోన్న స‌త్యం న్యూస్.నెట్.

గ‌డ‌చిన‌ రెండేళ్ల నుంచీ క‌రోనా మూలంంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డ జ‌ర‌గాల్సిన ప‌నులు జ‌ర‌గకుండా నిల‌చిపోయాయి.ఈ క్ర‌మంలోనే  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కూ డా జ‌ర‌గాల్సిన ప‌నులు ఎక్క‌డిక్క‌డే స్తంభించిపోయాయి. గ‌తేడాది న‌వంబ‌ర్ నుంచీ క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అన్ని శాఖ‌ల ప‌రంగా ప‌నులు చ‌క‌చ‌కా సాగుతున్నాయి.ఇందులో బాగంగా విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కూడా  అంచ‌నా వేసిన ప‌నుల‌కు నిదులు రావ‌డంతో ఆయా వ‌ర్క్ లకు ప్ర‌జాప్రతినిధులు శంకు స్థాప‌నలు చేయ‌డం..మున్సిప‌ల్ ఇంజ‌నీరింగ్ విభాగపు అదికారులు ప‌నులు ప్రారంభించ‌డం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోనే న‌గ‌రంలోని మ‌యూరీ జంక్ష‌న్ వ‌ద్ద  అదే జేడ్పీ ఆఫీసు నుంచీ  రైల్వే స్టేష‌న్ మీదుగా హోట‌ల్ బాలాజీ, సీఎంఆర్, వ‌ర‌కు గ‌ల  రోడ్ ను డ‌బుల్ రోడ్ గా చేయాల‌ని గ‌తేడాదే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తీర్మానించింది.అయితే అందుకు 62 ల‌క్ష‌ల వ్య‌యం అవుతుందని మున్సిప‌ల్ ఇంజ‌నీరింగ్ విభాగం కూడా  డీపీఆర్ ను  రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ కు పంపించింది కూడా.

అయితే తాజాగా ఆ అంచ‌నాకు సంబంధించి నిధులు రావ‌డంతో…మున్సిప‌ల్ ఇంజ‌నీరింగ్ విభాగం ప‌నులు ప్రారంభించింది. ఈ మేర‌కు జేడ్పీ నుంచీ రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు ఒక‌బిట్ , అలాగే కాస్త ఖాళీ  వ‌దులుతూ… అక్క‌డ నుంచీ సీఎంఆర్ వ‌ర‌కు రెర‌డో బిట్   రోడ్ ను డ‌బుల్ రోడ్ గా వేసే ప‌నిలో ప‌డింది.ఈ మేర‌కు రోడ్ కు  ఇరువైపులా..చిల్ల‌ర కొట్ల‌ను ఇటీవ‌లే తొల‌గించింది కూడ‌.అయితే లీలామహ‌ల్ థియేట‌ర్ ప‌క్క‌నే అతి పెద్ద షాపింగ్  మాల్ నిర్మాణం  అవుతున్ననేప‌ధ్యంలో ఆ షాపింగ్ మాల్ కు టూవీల‌ర్ తో పాటు ఫోర్ వీల‌ర్స్ కూడా వెళుతుంటాయి.

ఈ త‌రుణంలో  ఆ షాపింగ్ మాల్ కు దారెలే ఇస్తార‌ని వార్త‌వ‌ళి ప్ర‌శ్నిస్తోంది. డబుల్ రోడ్ నిర్మాణం అవుతున్న వేళ‌…అటు జేడ్పీ నుంచీ  ఇటు రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు ఏకంగా హైమాస్ లైట్ల‌తో డివైడర్ వ‌స్తుండ‌టంతో.. ఆ షాపింగ్ మాల్ కు వచ్చేందుకు యూట‌ర్న్ ఎక్క‌డ ఇస్తార‌నేది న‌గ‌ర వాసులు ప్ర‌శ్న‌. దీనిపై  దృష్టిసారించారా.?  లేక ప్ర‌త్యామ్నాయం  ఆలోచించారా అన్న‌ది సత్యం న్యూస్.నెట్ ప్ర‌శ్నిస్తోంది. ఏదైనా విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అయిన సంద‌ర్బంగా  న‌గ‌రం మొత్తం విశాల‌మైన రోడ్ల‌తో  నిర్మాణం కావ‌డం సంతోషం అని అంటోంది స‌త్యం న్యూస్.నెట్

Related posts

హై హాండెడ్ నెస్: పేద వాడి పొట్ట కొట్టిన బీజేపీ నేతలు

Satyam NEWS

ప్రయోగాత్మకంగా ర్యాపిడ్ ఆంటిజన్ టెస్టులు

Satyam NEWS

70 మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు

Satyam NEWS

Leave a Comment