29.7 C
Hyderabad
May 4, 2024 03: 35 AM
Slider కవి ప్రపంచం

శుభ ‘ కృతి ‘ కి స్వాగతం

#PVS Krishnakumari

శుభకృత్..
పెద్దక్క శార్వరి వదిలిపెట్టిన నిశీధ జ్ఞాపకాల్ని 
చిన్నక్క ప్లవ దాటించగా
మామిడి తోరణాలు,  మల్లెల విరజాజుల గుబాళింపుతో
తుమ్మెదలు ఝూంకార ధ్వనుల మధ్య
కావ్య నాయిక యై ఏతెంచింది శుభకృత్
పల్లవాలని తిని మత్తెక్కిన గొంతుకతో
శుభకృతులను ఆలపిస్తూ  కోయిలలు
“శుభకృత్” ని స్వాగతిస్తున్నాయి
కొమ్మల్లో రెమ్మల్లో దాగిన వసంతలక్ష్మి
నవ వధువులా  హొయలుబోతూ
రా చిలుకమ్మల కిలకిల రావాల నడుము
ఉగాది సుందరి ఆగమనాన్ని తిలకిస్తున్నది
ఇదే అదను అనుకున్నాడేమో
విరిబాణాలు చేబూని, ఏతెంచాడు మదనుడు
ఇంకేముంది,
అంతా శోభాయమానమే
జగమంతా సుందర నందన ఉద్యానవనమే
అంతా ఆశావహ దృక్పథమే
నిరాశా నిస్పృహలని అవనతం చేసి
మనో ప్రాంగణంలో  ఆశల పుష్పాలను పూయిస్తూ
అపశృతులు లేని శుభ ‘ కృతి’
ఆలపించాలని
ప్రతి హృదయం శుభకృత్ కి
స్వాగతం పలుకుతున్నది.

పీ.వీ.యస్. కృష్ణ కుమారి

Related posts

ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి డైలాగ్ లా జగన్ పాలన

Satyam NEWS

ఎండ్ ఆఫ్ ట్రేడ్ వార్: చైనాతో వాణిజ్య ఒప్పందం ఓకే

Satyam NEWS

రైతు మేలు కోసమే నియంత్రిత సాగు విధానం

Satyam NEWS

Leave a Comment