40.2 C
Hyderabad
April 28, 2024 17: 01 PM
Slider కవి ప్రపంచం

శుభకృదబ్దమిడును గాక శుభము మీకు

#Nellutla Sunitha New

తే.గీ:-1
గడిచి పోయిన వర్షాల కష్టములను
పార ద్రోలుచు సుఖ పరంపరలనిడుచు
నాయురారోగ్య భాగ్యమ్ము లందజేసి
శుభకృదబ్దమిడును గాక శుభము మనకు.
తే.గీ:-2
విద్య నేర్చు శిశువులకు విద్య నిచ్చి
యువత కంతకు బంగారు భవితనిచ్చి
సకల జీవ జాలమునకు సౌఖ్యమిచ్చి
శుభకృదబ్దమిడును గాక శుభము మనకు.
తే.గీ:-3
సరి సమయమందు వానలన్ కురియజేసి
నిండుకొననట్టి పంటలన్ పండజేసి
కరువు కాటకమ్ములనన్ని తరిమి వేసి
శుభకృదబ్దమిడును గాక శుభము మనకు.
తే.గీ:-4
దేశ దేశాల మధ్యన దివ్యమైన
స్నేహ సౌభ్రాతృభావముల్ నిండి సతము
శాంతి మార్గాన పయనించు కాంతి నింపి
శుభకృదబ్దమిడును గాక శుభము మనకు

నెల్లుట్ల సునీత, ఖమ్మం, 7989460657

Related posts

బద్వేల్ జాతీయ రహదారిపై ప్రమాదంలో ఒకరి మృతి

Satyam NEWS

మూఢ నమ్మకాలు వదిలేస్తేనే అభివృద్ధి చెందుతాం

Satyam NEWS

వివేక హత్య కేసులో వివరాల వెల్లడి క్రమశిక్షణ ఉల్లంఘనే

Satyam NEWS

Leave a Comment